ఒకప్పుడు మురుగదాస్ అంటే పాన్ ఇండియన్ డైరెక్టర్. ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా క్యూలో ఉండేవాళ్లు. మురుగదాస్ సినిమా అంటే పక్కా హిట్ అనే నమ్మకం ఉండేది. ఈయన కెరీర్ మొదలు పెట్టడం కూడా అలాగే మొదలు పెట్టాడు. అజిత్ తో చేసిన దీనా అయినా.. విజయ్ కాంత్ హీరోగా వచ్చిన రమణ అయినా.. సూర్యతో గజిని అయినా ఏదైనా కూడా మురుగదాస్ లోని దర్శకుడి స్థాయిని సౌత్ ఇండియాకు చాటి చెప్పాయి. ఆ తర్వాత హిందీలోనూ సత్తా చూపించాడు మురుగదాస్. మధ్యలో సెవెన్త్ సెన్స్ లాంటి సినిమాలు నిరాశ పరిచినా కూడా వెంటనే తుపాకి, కత్తి లాంటి సినిమాలతో తన రేంజ్ ఏంటో అందరికీ చూపించాడు. అయితే ఎందుకో మరి ఈయన నుంచి కొన్నేళ్లుగా సరైన సినిమాలు రావడం లేదు. మురుగదాస్ సినిమా అంటూ చెప్పుకునే స్థాయి సినిమాలు తగ్గించేసాడు ఈ దర్శకుడు.
కత్తి తర్వాత మురుగదాస్ చేసిన సినిమాలేవీ అంత యునానిమస్ టాక్ తెచ్చుకోలేదు. సర్కార్ సినిమా విజయం సాధించినా ..అది కూడా అభిమానులకు తప్ప ప్రేక్షకులకు పూర్తిగా నచ్చలేదు. మధ్యలో రజినీకాంత్ తో చేసిన దర్బార్ సైతం నిరాశ పరిచింది. ఇక మహేష్ బాబుతో చేసిన స్పైడర్ సినిమా గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది స్పైడర్. కొన్నేళ్లుగా ఈయన కెరీర్ కూడా డల్ గానే సాగుతుంది. అందుకే మురుగదాస్ సినిమా అంటే హీరోలు కూడా ఆలోచనలో పడిపోతున్నారు. ఈ మధ్యే రామ్ పోతినేని హీరోగా ఓ పాన్ ఇండియన్ సినిమా చేయడానికి మురుగదాస్ సిద్ధమయ్యాడని వార్తలు వినిపించినా కూడా ఇప్పుడు కమల్ హాసన్ లైన్ లోకి వచ్చాడు.
విజయ్ తో చేయాలనుకున్న సినిమానే కాస్త మార్చి కమల్ తో చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. విజయ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పట్లో ఈయనతో సినిమా అంటే కష్టమే. అందుకే ఈయన కోసం రాసుకున్న కథనే కమల్ హాసన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కమల్ హాసన్ కూడా ప్రస్తుతం భారతీయుడు 2తో పాటు లోకేష్ కనకరాజ్ విక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు దృశ్యం 2 సినిమాను కూడా తమిళంలో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. ఏదేమైనా కూడా ఒక్క ఫ్లాప్ తో మురుగదాస్ జాతకం తిరగబడింది.
ఇవి కూడా చదవండి..
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!