బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 13:28:42

ఎయిమ్స్ రిపోర్ట్‌పై ముంబై పోలీస్ స్పంద‌న‌

ఎయిమ్స్ రిపోర్ట్‌పై ముంబై పోలీస్ స్పంద‌న‌

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై అంద‌రిలో అనేక అనుమానాలు నెల‌కొన్నాయి. అత‌నిది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్య అని కొంద‌రు ఆరోపించారు. ఈ క్ర‌మంలో సుశాంత్ కి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టులను ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు సమగ్రంగా విశ్లేషించి ఇది హ‌త్య కాదు ఆత్మ‌హ‌త్య అని క‌న్‌ఫాం చేశారు. ఎయిమ్స్ రిపోర్ట్‌పై స్పందించిన ముంబై పోలీస్ చీఫ్ ప‌ర‌మ్ వీర్ సింగ్‌.. నిజం ఏంట‌నేది మాకు ఎప్పుడో తెలుసు అని పేర్కొన్నారు. అటాప్సీ రిపోర్ట్ ఆధారంగానే ముంబై పోలీసులు   దీనిని ఆత్మహత్యగా న‌మోదు చేసారు. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం నుండి వచ్చిన ఆరోపణలు , సోషల్ మీడియా, టీవీ ఛానెల్స్ అనేక అనుమానాలు రేకెత్తించ‌డంతో ఇది సీబీఐ ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని ప‌రమ్ వీర్ సింగ్ అన్నారు 

సుశాంత్ కేసుని మేము ప్ర‌త్యేకంగా ద‌ర్యాప్తు చేసాము. పోస్ట్‌మార్టంను ప్రొఫెష‌న‌ల్‌గా జ‌రిపించాం. సుప్రీంకోర్ట్ రిపోర్ట్ మా నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని చెప్పిన‌ప్పుడు వెంట‌నే ఇచ్చేసాం. మా రిపోర్ట్‌లో ఎలాంటి త‌ప్పులు దొర్ల‌లేద‌ని సుప్రీం కోర్ట్ చేప్పింది.  హ‌త్య కాదు ఆత్మ‌హ‌త్య అని మేం ఎన్నో సార్లు చెప్పిన‌ప్ప‌టికీ కొంద‌రు స్వార్ధ ప్ర‌యోజనాల కోసం దీనిని త‌ప్పుదోవ‌లో తీసుకెళ్ళారు. నిజం ఎప్పుడు ప్ర‌బ‌లంగానే ఉంటుంది. ఈ ర‌కంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎయిమ్స్ రిపోర్ట్‌తో మాకు ఉప‌శ‌మ‌నం క‌లిగింద‌నేది అవాస్త‌వం ఎందుకంటే మేము ఎప్పుడు ఈ కేసు విష‌యంలో ఒత్తిడికి గురి కాలేదు అని చెప్పారు.


logo