మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Jul 29, 2020 , 11:25:38

సుశాంత్ కేసులో ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం లేదు..

సుశాంత్ కేసులో ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం లేదు..

హైద‌రాబాద్‌: బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం లేద‌ని లాయ‌ర్ వికాస్ సింగ్ తెలిపారు.  సుశాంత్ మ‌ర‌ణానికి రీయా చ‌క్ర‌వ‌ర్తి కార‌ణ‌మంటూ తాజాగా పాట్నాలో ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. సుశాంత్ తండ్రి కృష్ణ‌కుమార్ సింగ్ ఫిర్యాదు మేర‌కు ఆ కేసు న‌మోదు చేశారు. అయితే సుశాంత్ తండ్రి త‌ర‌పున మాజీ అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ వికాస్ సింగ్ కేసును వాదించ‌నున్నారు. సుశాంత్ కుటుంబ‌స‌భ్యులు షాక్‌లో ఉన్నార‌ని, ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే.. ఆ కేసులో పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశార‌ని లాయ‌ర్ వికాస్ తెలిపారు. సుశాంత్ కేసులో పెద్ద పెద్ద నిర్మాత‌ల పేర్ల‌ను వెల్ల‌డించాలంటూ ముంబై పోలీసులు వ‌త్తిడి తెస్తున్న‌ట్లు కూడా లాయ‌ర్ చెప్పారు. ఆ కేసు రూటు మారుతోంద‌ని ఆయ‌న అన్నారు.  

అయితే ఈ కేసులో ముంద‌కు సాగేందుకు పాట్నా పోలీసులు వెనుకాడార‌ని, కానీ సీఎం నితీశ్ కుమార్‌, మంత్రి సంజ‌య్ జా ఆదేశాల‌తో పోలీసులు కేసు న‌మోదు చేసిన‌ట్లు లాయ‌ర్ వికాస్ సింగ్ చెప్పారు. పాట్నా పోలీసులే ఈ కేసును డీల్ చేయాల‌ని సుశాంత్ కుటుంబ‌స‌భ్యులు కోరుతున్న‌ట్లు లాయ‌ర్ తెలిపారు. ఈ కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని సుశాంత్ ఫ్యామిలీ డిమాండ్ చేయ‌లేద‌న్నారు.