మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 12:13:00

లైంగిక దాడి కేసు: అనురాగ్‌కు నోటీసులు

లైంగిక దాడి కేసు: అనురాగ్‌కు నోటీసులు

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చెబుతూ  పాయల్ ఘోష్ ఇటీవ‌ల‌ సంచలన విషయాలను బయటపెట్టిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా  మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కొష్యారీని క‌లిసి తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో త‌న‌కు వై కేటిగిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని  గ‌వర్న‌ర్ ను కోరారు. ఈ మేర‌కు పాయ‌ల్ ఘోష్ గ‌వ‌ర్న‌ర్ కు ఓ లేఖ కూడా అంద‌జేసింది పాయ‌ల్ ఘోష్ .

లైంగిక దాడికి సంబంధించి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అనురాగ్ క‌శ్య‌ప్‌కు ముంబై పోలీసులు స‌మ‌న్లు జారీ చేశారు. రేపు ఉద‌యం 11గం.ల‌కు వ‌ర్సోవా పోలీస్ స్టేష‌న్‌కు హాజ‌రు కావాల‌ని అందులో తెలిపారు. అయితే అనురాగ్ క‌శ్య‌ప్ త‌ను అలాంటి వాడిని కాద‌ని, కావాల‌నే పాయ‌ల్ త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని ఇటీవ‌ల పేర్కొన్నారు. ఆయ‌న‌కు వ‌ర్మ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ద్దతుగా నిలుస్తున్నారు. మ‌రోవైపు పాయ‌ల్‌కు కూడా సినీ ప్ర‌ముఖులే కాక రాజ‌కీయ నాయ‌కులు కూడా మ‌ద్ద‌తు ఇస్తుండ‌డం కొస‌మెరుపు. 


logo