గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 09, 2020 , 14:06:54

కంగ‌నా ఆఫీసు కూల్చివేతపై ముంబై హైకోర్టు స్టే

కంగ‌నా ఆఫీసు కూల్చివేతపై ముంబై హైకోర్టు స్టే

ముంబై:  బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కు ముంబై హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. బీఎంసీ అధికారులు ముంబైలోని త‌న‌ కార్యాలయం కూల్చివేయ‌డంపై‌ కంగ‌నా హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ మేర‌కు కంగ‌నా కార్యాల‌యం కూల్చివేత‌పై ముంబై హైకోర్టు స్టే ఇచ్చింది. ముంబైలోని కంగనా రనౌత్ ఆఫీస్ పై ఆక‌స్మిక దాడులు చేపట్టిన‌ బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు..మంగ‌ళ‌వారం కంగ‌నా ర‌నౌత్ కార్యాల‌యానికి స్టాప్ వ‌ర్క్ నోటీసులు అంటించిన విష‌యం తెలిసిందే.

మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 / ఎ కింద, బీఎంసీ సభ్యులు నటి కార్యాలయ గేటుపై మూడు పేజీల నోటీసును అతికించారు. ఈ మేర‌కు అధికారులు ఇవాళ కంగ‌నా కార్యాల‌యం కూల్చివేత ప‌నుల‌ను షురూ చేశారు. కార్మికులు కూల్చివేస్తున్న దృశ్యాల‌ను ట్విట‌ర్ లో కంగనా షేర్ చేసింది. కూల్చివేత ప‌నుల‌ను స‌వాలు చేస్తూ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు స్టే ఇచ్చింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo