ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం నార్కొటిక్స్ బ్యూరో (ఎన్సీబీ) అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. బెయిలు కోసం అతను ఇప్పటి వరకూ వేసిన పిటిషన్లన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది.
ఈ క్రమంలో బాంబే హైకోర్టు ముందు తన బెయిలు కోసం మరోసారి ఆర్యన్ పిటిషన్ వేశాడు. అతనికి బెయిలు ఇవ్వొద్దని వాదిస్తున్న ఎన్సీబీ ఆర్యన్ వాట్సాప్ చాట్స్‌ను సాక్ష్యాలుగా చూపుతోంది, వీటిలో అతను పలువురితో డ్రగ్స్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
అయితే తన వాట్సాప్ చాట్స్‌ను ఎన్సీబీ వక్రీకరిస్తోందని, తనపై నిందారోపణలు చేస్తోందని తన తాజా బెయిలు పిటిషన్లో ఆర్యన్ పేర్కొన్నాడు. ఈ బుధవారం నాడు అతను వేసిన బెయిలు పిటిషన్‌ను నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) యాక్ట్ కోర్టు కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో తాజా బెయిలు పిటిషన్‌ను బాంబే హైకోర్టులో వేసిన ఆర్యన్ తన పిటిషన్లో ఎన్సీబీపై ఆరోపణలు చేశాడు.