టాలీవుడ్ (Tollywood) భామ సమంత (Samantha) సెకండ్ ఇన్నింగ్స్ లోనూ విజయవంతంగా సినిమాలు చేస్తూ జోష్ మీదుంది. తెలుగులో నటిస్తోన్న భారీప్రాజెక్టు శాకుంతలం (Shakuntalam) షూటింగ్ పూర్తి చేసిన సామ్ కొత్తగా ఏ సినిమాకు సంతకం చేయలేదు. అయితే లూయిస్ వుయిట్టన్ ( Louis Vuitton photoshoot) ఫొటోషూట్ తో హాట్ హాట్ లుక్ లో కనిపిస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సామ్ ఎప్పుడూ లేనంతగా గ్లామర్ షో చేస్తుండటంతో సినీ జనాలంతా ఈ భామ గురించే చర్చించుకుంటున్నారు.
సామ్ కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుంటుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా బీటౌన్ లో చక్కర్లు కొడుతున్న వార్త గురించి తెలిస్తే అదంతా ఉత్తదేననిపిస్తుంది. ఇంతకీ విషయమేంటంటే సమంతకు ముంబై (Mumbai) నుంచి పిలుపు వచ్చిందట. ఈ భామ కొత్తగా రెండు ప్రాజెక్టుల్లో నటించేందుకు పచ్చ జెండా ఊపిందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. తాజా టాక్ ప్రకారం ది ఫ్యామిలీ మ్యాన్ 2 మేకర్స్ రాజ్& డీకే వెబ్ సిరీస్ లో నటించేందుకు సామ్ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించబోతుందట.
త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్. మరోవైపు సమంత ముంబైలో ఓ ఇంటిని వెతికే పనిలో పడ్డట్టు తెలుస్తోండగా..ఇక సామ్ తన ఫోకస్ అంతా హిందీ ఇండస్ట్రీపై పెట్టనుందనే అంతా అనుకుంటున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్ లాగా ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసి మరిన్ని అవకాశాలవైపు సామ్ దృష్టి సారించబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని