గురువారం 28 మే 2020
Cinema - May 06, 2020 , 10:58:25

తెలుగు నేర్చుకుంటున్న ముంబై భామ‌

తెలుగు నేర్చుకుంటున్న ముంబై భామ‌

లాక్‌డౌన్ కొంద‌రికి చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇన్నాళ్లు తాము చేయాల‌నుకున్న‌ పనులు, నేర్చుకోవ‌ల‌సిన విద్య‌లు ఈ స‌మ‌యంలో చేస్తున్నారు. తాజాగా ముంబై బ్యూటీ రుహానీ శ‌ర్మ లాక్‌డౌన్ స‌మ‌యంలో తెలుగు నేర్చుకునేందుకు కుస్తీలు ప‌డుతుంది. చిల‌సౌ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిలో ప‌డ్డ రుహానీ ఇటీవ‌ల హిట్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది

రానున్న రోజుల‌లో రుహానీకి ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ఆఫ‌ర్స్ రానుండ‌గా, ఇందుకోసం తెలుగు నేర్చుకునే ప‌నిలో ప‌డిందట‌. ఇంట‌ర్నెట్‌లో రోజ‌కి రెండు గంట‌లు నేర్చుకుంటుంద‌ట‌. అంతేకాక హైద‌రాబాద్‌లో ఉన్న త‌న ఫ్రెండ్ ద్వారా కూడా తెలుగుపై ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నం చేస్తుంది. రుహానీ త్వ‌ర‌లో ఎంఎస్ రాజు డ‌ర్టీ హ‌రి, విష్ణు మంచు మోస‌గాళ్ళు, అవ‌స‌రాల శ్రీనివాస్ క్రేజీ ప్రాజెక్టుల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 


logo