జూన్ 10వ తేదీ..నందమూరి అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే ఆ రోజు బాలకృష్ణ పుట్టినరోజు. బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ నుంచి పెద్ద అనౌన్స్ మెంట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ నుంచి చాలా ప్రకటనలు ఉంటాయని ఫిలింనగర్ సర్కిల్ లో జోరుగా చర్చ నడుస్తోంది.
గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బర్త్ డేన దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందట. అంతేకాదు అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా అదే రోజు వస్తుందని టాక్. మరోవైపు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న అఖండ సినిమా నుంచి మరో పోస్టర్ కూడా విడుదల అవుతుందని తెలుస్తోంది.
కొంతకాలంగా గ్యాప్ తీసుకున్న బాలయ్య ఈ సారి మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దమవుతున్నాడని టాక్.
ఇవి కూడా చదవండి..
చిరు వాయిస్ ఓవర్‌తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్