శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 15:42:23

క‌పిల్ శ‌ర్మ షోకు వెళ్ల‌ని 'శ‌క్తిమాన్' ..కార‌ణ‌మిదే..!

క‌పిల్ శ‌ర్మ షోకు వెళ్ల‌ని 'శ‌క్తిమాన్' ..కార‌ణ‌మిదే..!

ది క‌పిల్ శ‌ర్మ షోకు భార‌త్ లో మాత్ర‌మే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిమంది ఫాలోవ‌ర్లున్న విష‌యం తెలిసిందే. త‌నదైన కామెడీ ట‌చ్ ఇస్తూ..పంచ్ డైలాగ్స్ తో వినోదాన్ని అందించ‌డం క‌పిల్ శ‌ర్మ స్టైల్‌. ఈ షోకు క‌పిల్ శ‌ర్మ బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను ఆహ్వానిస్తుంటాడ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎక్కువ‌గా సినిమా ప్ర‌మోష‌న్స్ లో న‌టీన‌టులు, డైరెక్ట‌ర్ల‌ను షోకు పిలుస్తుంటాడు. అయితే క‌పిల్ శ‌ర్మ షో నుంచి ఆహ్వానం వ‌స్తే ఓ ప్ర‌ముఖ న‌టుడు తిర‌స్క‌రించాడ‌ట‌. శ‌క్తిమాన్ సీరియ‌ల్ తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న సీనియ‌ర్ న‌టుడు ముఖేశ్ ఖ‌న్నా.

మ‌హాభార‌త్ సీరియ‌ల్ లో ముఖేశ్ ఖ‌న్నా భీష్మ పితామ‌హుడి పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌హాభార‌త్ స్పెష‌ల్ ఎపిసోడ్ స‌మ‌యంలో క‌పిల్ శ‌ర్మ షోకు నితిన్ భ‌రద్వాజ్‌, గుఫీ పెయింట‌ల్ గ‌జేంద్ర చౌహాన్‌, అర్జున్, పునీత్ ఇస్సార్ హాజ‌ర‌య్యారు. కానీ ఒక్క‌రు మాత్రం మిస్స‌య్యారు. ఆ ఒక్క‌రు ఎవ‌రో కాదు ముఖేశ్ ఖ‌న్నా. అయితే అంద‌రూ వ‌చ్చి ముఖేశ్ ఖ‌న్నా రాక‌పోయేస‌రికి ఆశ్య‌ర్య‌పోవ‌డం అభిమానుల వంతైంది. దీనిపై ముఖేశ్ ఖ‌న్నా స్పందిస్తూ..క‌పిల్ శ‌ర్మ షో నుంచి వ‌చ్చిన ఆహ్వానాన్ని తిర‌స్క‌రించిన‌ట్టు చెప్పారు. చీప్‌, వ‌ల్గ‌ర్, అధ్వాన్నంగా ఈ షో సాగుతుంద‌ని, అందుకే తాను ఈ షోకు వెళ్ల‌లేద‌ని ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ పెట్టారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.