శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 24, 2021 , 07:50:58

ఏజ్ గ్యాప్‌పై నోరు విప్పిన బాలీవుడ్ న‌టి

ఏజ్ గ్యాప్‌పై నోరు విప్పిన బాలీవుడ్ న‌టి

బాలీవుడ్ న‌టి ముగ్దా గాడ్సే ఫ్యాష‌న్‌తో న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది.  గలీ గలీ చోర్‌ హై, విల్‌ యూ మ్యారీ మీ?, హీరోయిన్‌ వంటి సినిమాల్లో మెరిసిన ఈ అమ్మ‌డు రాహుల్ దేవ్‌(52)తో డేటింగ్‌లో ఉంది. మ‌రి కొద్ది రోజుల‌లో వీరి బంధానికి ఎనిమిదేళ్లు నిండ‌నున్నాయి. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న క‌న్నా 18 ఏళ్లు పెద్ద వాడైన రాహుల్ దేవ్‌తో సంతోషంగా ఉన్నారా లేదా అనే దానిపై వివ‌ర‌ణ ఇచ్చింది. ప్రేమ ఎప్పుడు ఎక్క‌డ పుడుతుందో తెలియ‌దు. అనుభ‌విస్తేనే తెలుస్తుంది. ప్రేమ‌కు వ‌య‌స్సుతో సంబంధం ఉండ‌దు. మ‌న పార్ట్న‌ర్‌ని ఎంచుకోవ‌డం అంటే షాపిం చేసిన‌ట్టు కాదు అని చెప్పుకొచ్చింది ముగ్ద‌. 

టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో ప్రతి నాయకుడి పాత్రల‌లో న‌టించి మెప్పించిన‌  రాహుల్‌ దేవ్‌కు గతంలో రీనాతో వివాహం జరిగింది.  వీరికి సిద్ధాంత్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే 2009లో రీనా క్యాన్సర్‌తో మృతి చెంద‌గా, ఆ త‌ర్వాత ముగ్దాతో ప్రేమ‌లో ప‌డ్డాడు. కొన్నాళ్ళుగా వీరిద్ద‌రు క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తున్నారు.  

VIDEOS

logo