అగ్ర నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని తెరకెక్కించిన ఎమ్మెస్ రాజు ‘డర్టీ హరి’ సినిమాతో దర్శకుడిగా మారారు. ప్రస్తుతం ఆయన ‘7డేస్..6నైట్స్’ పేరుతో మరో ప్రయోగాత్మక ఇతివృత్తంతో సినిమాను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. నూతన తారాగణంతో ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం పద్నాలుగేళ్ల వయసున్న సమర్త్ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్లు సమాచారం. యువబృందంతో వైవిధ్యంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఎమ్మెస్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.