గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 20:43:52

దిల్‌రాజు-బోయ‌పాటి కాంబినేష‌న్‌..హీరో..?

దిల్‌రాజు-బోయ‌పాటి కాంబినేష‌న్‌..హీరో..?

మ‌హేశ్‌-వంశీ పైడిప‌ల్లితో సినిమా చేసేందుకు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు స‌న్నాహాలు చేసినా వర్క‌వుట్ కాలేద‌నే విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ప్రభాస్ తో సినిమా చేయాల‌నుకున్నా ఇప్ప‌ట్లో సాధ్య‌మయే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ‌మ‌రోవైపు స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో సినిమా చేయాల‌నుకున్నా..ప్ర‌స్తుతం పుష్ప సినిమా చేస్తుండ‌టంతో మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా దిల్ రాజు యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనును లైన్ లో పెట్టిన‌ట్టు టాలీవుడ్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌తో సినిమా చేస్తున్న బోయ‌పాటికి దిల్ రాజు ఓ సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.

వినయ విధేయ రామ ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన త‌ర్వాత మ‌ళ్లీ బాలయ్య సినిమాతో ట్రాక్ లోకి రావాల‌నుకుంటున్నాడు బోయ‌పాటి. ఈ డైరెక్ట‌ర్ రీసెంట్ ట్రాక్ రికార్డును మ‌ళ్లీ తిర‌గ‌రాస్తాడ‌న్న న‌మ్మ‌కంతో దిల్ రాజు..బోయ‌పాటితో సినిమా చేసేందుకు రెడీ అయిన‌ట్టు ఇన్ సైడ్ టాక్ న‌డుస్తోంది. మ‌రి దిల్‌రాజు-బోయ‌పాటి సినిమా తెరరూపం దాల్చుతుందా..? ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డితే హీరో ఎవ‌ర‌నేది  చూడాలి. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo