శనివారం 30 మే 2020
Cinema - May 05, 2020 , 14:37:38

జూన్ నుండి సినిమా షూటింగ్స్..!

జూన్ నుండి సినిమా షూటింగ్స్..!

లాక్‌డౌన్ వ‌ల‌న అనేక రంగాలలో తీవ్ర సంక్షోభం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ ఆర్థిక ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా సినిమా షూటింగ్‌లు ప్రారంభించాల‌ని సినీ పెద్ద‌లు కోరుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు మంగళవారం తలసానిని కలిసి లేఖ అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ త్వ‌ర‌లోనే మంచి రోజులు వ‌స్తాయ‌ని అన్నారు.

క‌రోనా వ‌ల‌న సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారందరికి రేషన్ కార్డుల ద్వారా ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం.అలాగే కరోనా క్రైసిస్‌ చారిటీ(సిసిసి) ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇప్పటివరకు సిసిసి ద్వారా 14 వేల మంది సినీ కార్మకులను ఆదుకోవడం గొప్ప విషయం. లాక్‌డౌన్ త‌ర్వాత ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో చ‌ర్చలు జ‌రిపి సింగిల్ విండో పాలసీ తో ముందుకు వెళ్తాము. జూన్ నుండి షూటింగ్‌లు మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. దీనిపై రెండు రాష్ట్రాలు చ‌ర్చించి ఓ నిర్ణ‌యానికి  వ‌స్తాం అని పేర్కొన్నారు త‌ల‌సాని

చిత్ర ప‌రిశ్ర‌మ‌ని ఎలా అభివృద్ది చేయాల‌నే దానిపై చిరంజీవి, నాగార్జున‌ల‌తో ఇప్ప‌టికే మూడుసార్లు స‌మావేశం అయ్యాం. ప్ర‌భుత్వం కూడా నూత‌న పాల‌సీని విడుద‌ల చేయాల‌ని భావిస్తుంది. కొద్ది రోజులు ఓపిక ప‌డితే అంతా స‌ద్దుమ‌ణుగుతుంద‌ని త‌ల‌సాని స్ప‌ష్టం చేశారు 


logo