ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 17, 2020 , 14:07:40

సుశాంత్‌-సారా బ్రేక‌ప్ కు వారే కార‌ణం: క‌ంగ‌నా

సుశాంత్‌-సారా బ్రేక‌ప్ కు వారే కార‌ణం: క‌ంగ‌నా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మృతి త‌ర్వాత అత‌ని వ్య‌క్తిగ‌త జీవితం, రొమాంటిక్ రిలేష‌న్ షిప్ ల‌పై మీడియాలో చ‌ర్చ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. కేదార్‌నాథ్ కోస్టార్ సారా అలీఖాన్ తో సుశాంత్ డేటింగ్ లో ఉన్నాడ‌ని, మూవీ మాఫియా వ‌ల్లే వారిద్ద‌రూ క‌ల‌వ‌లేక‌పోయార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా దీనిపై కంగ‌నా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..సారా, సుశాంత్ బ్రేక‌ప్ కు మూవీ మాఫియానే కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చింది. ఆ మూవీ మాఫియా నిషేధం విధించి.

సుశాంత్‌కు సమ‌స్య‌లు తెచ్చిపెట్టింది. నేను మాఫియాకు వ్య‌తిరేకంగా బ‌హిరంగంగా మాట్లాడాను. సుశాంత్ సారాతో డేటింగ్ లో ఉన్న‌పుడు ఖ‌చ్చితంగా వారు విడిపోయేలా చేశారు. క‌రీనాక‌పూర్ కూడా మీ తొలి హీరోతో డేటింగ్ చేయొద్ద‌ని చెప్పిన మాటలు రికార్డులో ఉన్నాయి. మూవీ మాఫియా బ‌హిరంగంగానే మిమ్మ‌ల్ని హ‌త్య చేస్తారు. భావోద్వేగ‌పూరిత రాబంధుల స‌మూహం వ‌చ్చి అనుకున్న‌ది చేసింది. ఇపుడు ఇదే గ్యాంగ్ మూవీ మాఫియా న‌న్ను కూడా ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని కంగ‌నార‌నౌత్ స్ప‌ష్టం చేసింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.