హిందీ బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సీరియల్ నాగిని.ఇందులో నటించిన మౌని రాయ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెరపైన ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తూ రచ్చ చేసే మౌని ఆఫ్‌స్క్రీన్‌లోను సెగలు పుట్టిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాల్దీవుల్లో విహారయాత్రలో చిలౌట్ అవుతోంది. ఇందులో బికినీ ట్రీట్ కి సంబంధించిన ఫొటోలని బంచ్‌గా విడుదల చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
నాగిని సీరియల్ తర్వాత మౌని రాయ్ క్రేజ్ బాగా పెరగగా, ఈ అమ్మడికి పలు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. అందాల ఆరబోతతో ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్ లో ఐటమ్ నంబర్ తో ఇటు సౌత్ కి పరిచయమైంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కొంత రిలాక్సేషన్ కోసం తన స్నేహితులతో కలిసి మాల్దీవులకి వెళ్లింది.ద్వీప దేశం నుండి బీచ్-రెడీ దుస్తులను ధరించి యూత్‌కి కంటిపై కనుకు లేకుండా చేస్తుంది. తన ఫోటోలకు మౌని ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది. జాక్ హిల్టన్ రాసిన ఫుట్ లూస్ అండ్ ఫ్యాన్సీ ఫ్రీ అనే పాటను ట్యాగ్ చేసి మౌని తన మానసిక స్థితిని వివరించింది.