హౌజ్ లోకి అమ్మలొచ్చారు.. కంటెస్టెంట్స్ కన్నీరు పెట్టుకున్నారు

బిగ్ బాస్ హౌజ్ అంటే ముందుగా గుర్తొచ్చేది గొడవలే. అక్కడ ఎవరు ఎప్పుడు గొడవ పడతారో తెలియదు. ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్లు కూడా ఉన్నట్లుండి గొడవలు పడుతుంటారు. అయితే ఎప్పుడూ హాట్ గా ఉండే ఇంటిని కాస్త కూల్ చేసాడు బిగ్ బాస్. దానికోసం వాళ్ల ఇంటి సభ్యులను పిలిచాడు. అందులోనూ అందరి అమ్మలను ఇంటికి పిలిచి ఆనందాల హరివిల్లు విరిసేలా చేసాడు బిగ్ బాస్. ప్రతీ సీజన్ లోనూ ఇది జరుగుతుంది. అయితే అప్పుడు ఇంటికి కేవలం అమ్మలు మాత్రమే కాకుండా అందర్నీ పిలిచేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా కేవలం తల్లిని మాత్రమే తీసుకొచ్చారు. వాళ్లను చూడగానే ఇంటి సభ్యులు చిన్న పిల్లలు అయిపోయారు. ఒక్కొక్కరుగా వెళ్లి అక్కడ వాళ్లను మనసుకు హత్తుకున్నారు.
మధ్యలో అద్దం అడ్డు పెట్టినా కూడా మనసుతోనే మాట్లాడుకున్నారు. అందరికంటే ముందుగా ఇంట్లోకి హారిక తల్లిని పంపించారు. ఆమె వచ్చే సమయానికి హారిక గేమ్ మధ్యలో ఉంది. అది కూడా బిగ్ బాస్ ఫ్రీజ్ మోడ్లో ఉంచాడు. దాంతో ఆమెను చూసి హారిక కన్నీరు పెట్టుకుంది. వెంటనే వెళ్లి అమ్మతో మాట్లాడింది. ఆ తర్వాత అభిజీత్ మదర్ వచ్చి ఇంట్లో హంగామా చేసింది. ఆమె అఖిల్, అభి మధ్య జరిగే వాటిపై కూడా చర్చించింది. ఇక్కడ ఎవరూ శత్రువులు లేరు ఆంటీ.. అంతా గేమ్ కోసమే అంటూ చెప్తే కొట్టుకోండి కావాలంటే అంటూ కామెడీ చేసింది అభి తల్లి.
ఆ తర్వాత అఖిల్ అమ్మగారు వచ్చారు. ఆమెను చూడగానే మమ్మీ అంటూ ఏడ్చేసాడు అఖిల్. అవినాష్ వాళ్ల అమ్మగారు వచ్చి డాన్సులు కూడా చేసారు. ఇంట్లో ఊరికే పెళ్లి గురించి మాట్లాడుతూ టెన్షన్ పడుతున్నాడంటే.. బయటికి వచ్చిన వెంటనే చేస్తలే నాన్న అంటూ అవినాష్ వాళ్ల అమ్మగారు చెప్పారు. దాంతో ఒక్కసారిగా అంతా నవ్వుకున్నారు. ఇక ఇంటి నుంచి అందరూ బయటికి వెళ్లిపోయిన తర్వాత గ్రూపులా వచ్చి డాన్సులు చేసారు. ఇది చూసిన తర్వాత బిగ్ బాస్ అంటే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అనేది అర్థమవుతుంది. సీజన్ చివరి దశకు వచ్చేయడంతో మరింత స్పెషల్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 20 రోజుల్లో కొలువుదీరనున్న గ్రేటర్ నూతన పాలకవర్గం
- ఆటోమొబైల్ సర్వీస్సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం
- 27 నుంచి పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
- ఈ రాశులవారు.. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందుతారు
- కరీంనగర్ వాసుల ఐటీ స్వప్నం సాకారమైంది
- వాణిజ్య పంటలతోనే ఆర్థిక పరిపుష్టి సాధ్యం
- కల్తీరాయుళ్లపై కొరడాకు సిద్ధం
- ‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం
- పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల
- రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం