బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 00:09:52

బ్రహ్మచారితో భామా కలాపం

బ్రహ్మచారితో భామా కలాపం

లాక్‌డౌన్‌ విరామాన్ని కుటుంబంతో ఆస్వాదించిన పూజాహెగ్డే ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టింది. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' షూటింగ్‌లో పాల్గొంది. అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. వేసవిలో ఈ సినిమా విడుదలకావాల్సింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. తాజాగా మంగళవారం నుంచి  చిత్రబృందం తిరిగి  షూటింగ్‌ను మొదలుపెట్టింది.  హైదరాబాద్‌లో అఖిల్‌ అక్కినేని, పూజాహెగ్డేలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వ్యానిటీ వ్యాన్‌ ముందు నిల్చొని చిరునవ్వులు చిందిస్తున్న ఆన్‌లొకేషన్‌ స్టిల్‌ను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది పూజాహెగ్డే. ఇందులో ఆమెతో పాటు మేకప్‌సిబ్బంది పీపీఈ కిట్‌ ధరించి కనిపిస్తున్నారు. పూజాహెగ్డే పోస్ట్‌ చేసిన ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తికానున్నట్లు సమాచారం. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


logo