e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home సినిమా రొమాన్స్‌ అంటే ఇబ్బందే!

రొమాన్స్‌ అంటే ఇబ్బందే!

‘ఈ సినిమాను నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నా. కథ బాగా నచ్చడంతో నిజాయితీగా కష్టపడ్డా. జయాపజయాల గురించి ఆలోచించకుండా నటుడిగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నా’ అన్నారు యువహీరో అక్కినేని అఖిల్‌. ఆయన కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బన్నీ వాసు నిర్మాత. నేడు ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో అఖిల్‌ గురువారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

కొత్తగా అనిపించింది..

దర్శకుడు భాస్కర్‌ ఈ కథ చెప్పినప్పుడు రొటీన్‌కు భిన్నంగా చాలా కొత్తగా అనిపించింది. ప్రేమ, పెళ్లి బంధాల్లోని సమస్యలు..వాటికి పరిష్కారాలు ఏమిటనే అంశం బాగా ఆకట్టుకుంది. సినిమా చూసిన తర్వాత మన వ్యక్తిగత జీవితాల్లోని సమస్యల్ని ఎలా అధిగమించాలో కూడా తెలుసుకుంటాం. కేవలం ప్రేమకథగా మాత్రమే కాకుండా స్త్రీపురుష సంబంధాల్లోని సున్నితమైన భావోద్వేగాల్ని అర్థవంతంగా ఆవిష్కరిస్తుంది. నా జీవితంలో కూడా గర్ల్‌ఫ్రెండ్‌ ఉంది కాబట్టి ఈ కథతో బాగా కనెక్ట్‌ అయ్యాను. నాన్నకు ఈ కథ చెప్పాను. ఆయనకు కూడా బాగా నచ్చింది.

కుటుంబమంతా ఆస్వాదిస్తారు..

- Advertisement -

ఈ సినిమాలో నేను హర్ష అనే యువకుడిగా కనిపిస్తా. మూడేళ్ల కాలవ్యవథిలో జరిగే కథ ఇది. జీవితం పట్ల ఎలాంటి స్పష్టతలేని ఓ కన్‌ఫ్యూజ్డ్‌ స్థితి నుంచి ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన వ్యక్తిగా హర్ష ఎలా ఎదిగాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో నేను కథతో పాటు దర్శకుడి ప్రతిభ..గీతా ఆర్ట్స్‌ ఉత్తమ నిర్మాణ విలువల్ని బాగా నమ్మాను. అందరం కలిసి ఓ టీమ్‌గా మంచి సినిమా చేద్దామని ప్రయత్నించాం. కుటుంబంతో కలిసి అందరు హాయిగా ఆస్వాదించే చిత్రమిది.

అదే రొమాన్స్‌ అంటే..

ఈ సినిమాలో రొమాంటిక్‌ సీన్స్‌ పొయెటిక్‌గా అనిపిస్తాయి. రొమాన్స్‌ అంటే ముద్దుపెట్టుకోవడం లేదా శారీరక స్పర్శ అనే భావనతో కాకుండా చిన్న చిన్న బహుమతుల్ని ఇచ్చిపుచ్చుకోవడం.. ప్రేమను అందంగా అక్షరాల ద్వారా తెలియజేయడం కూడా రొమాన్సే అని దర్శకుడు కవితాత్మకంగా ఆవిష్కరించారు. పూజాహెగ్డేలోని కష్టపడే తత్వం నన్ను చాలా ఇంప్రెస్‌ చేసింది. వివిధ భాషల్లో షూటింగ్స్‌ వల్ల ప్రయాణాలతో ఆమె బిజీగా ఉంటుంది. అయినా ఏమాత్రం అలసిపోకుండా పనిచేస్తుంది. తెలుగు అంత స్పష్టంగా రాకపోయినా డబ్బింగ్‌ బాగా చెప్పడం గొప్పగా అనిపించింది.

ఫ్యామిలీ మెంబర్‌లా చూశారు

గీతా ఆర్ట్స్‌లో నన్ను ఓ ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. అరవింద్‌గారిని నేను ఓ గాడ్‌ఫాదర్‌లా భావిస్తా. బన్నీ వాసుగారు దగ్గరుండి అన్ని వ్యవహారాలు పర్యవేక్షించారు. ‘ఏజెంట్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతున్నది. కొన్ని ఎపిసోడ్స్‌ కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నా. ఆ సినిమాను వచ్చే ఏడాదే విడుదల చేస్తాం. ప్రస్తుతం వరుసగా కథలు వింటున్నా. రాబోవు రెండు సంవత్సరాలు నటుడిగా బిజీగా ఉండబోతున్నా. నా తదుపరి సినిమా వివరాల్ని త్వరలో వెల్లడిస్తా.

ఇక్కడి నుంచి పంపించొద్దు

ఈ గెటప్‌ బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల కోసం కాదు. నేను తెలుగు హీరోనే. నన్ను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు చేయొద్దు (నవ్వుతూ). ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాన్ని ఎంతో ఇష్టపడి నిజాయితీగా చేశాను. రొమాంటిక్‌ సన్నివేశాల్లో నేను చాలా ఇబ్బంది పడతాను. షూటింగ్‌ సమయంలో చుట్టూ వంద మంది ఉంటారు. అలాంటి వాతావరణంలో రొమాంటిక్‌ సీన్స్‌ చేయడానికి కొంచెం సిగ్గనిపిస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement