శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Jan 13, 2021 , 21:23:19

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే..?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే..?

అక్కినేని అఖిల్-పూజాహెగ్డే కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్.   బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్ తో ఆల‌స్య‌మైంది. తాజాగా ఈ చిత్రం ఎప్పుడు విడుద‌ల‌వుతుంద‌నే విష‌యంపై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియజేస్తూ ప్ర‌త్యేక పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. వేస‌విలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానుట్టు ట్విట‌ర్ ద్వారా గీతాఆర్ట్స్ తెలిపింది.

ప్ర‌స్తుతం ఈ సినిమాలోని కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్-2 బ్యాన‌ర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు వాసు వ‌ర్మ కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గోపిసుంద‌ర్ సంగీత స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన హిట్టు లేని అఖిల్ ప్ర‌స్తుతం ఈ సినిమాపైనే చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. 

ఇవి కూడా చ‌ద‌వండి

మ‌తి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..ఫొటోలు వైర‌ల్

అన‌సూయకు సూప‌ర్‌స్టార్ తో న‌టించే ఛాన్స్ ..?

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

‘టైమ్ ’చూసి దిగుతున్నారు

త్రివిక్ర‌మ్‌తో సినిమాపై రామ్ స్పంద‌న ఏంటి?

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

12 కి.మీ సైకిల్ తొక్కిన‌ ర‌కుల్‌..ఎందుకంటే..?లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo