రసాయన మార్పు జరిగినప్పుడు జరిగే మార్పు? 1) భౌతిక ధర్మాల్లో మాత్రమే 2) రసాయన సంఘటనల్లో మాత్రమే 3) స్థితి, రంగులో మాత్రమే 4) భౌతిక ధర్మాలతో పాటు రసాయన సంఘటనలో కూడా
లెడ్ ఆక్సైడ్ రంగు ఏది? 1) పసుపు 2) ఆకుపచ్చ 3) జేగురు రంగు 4) రంగులేని వాయువు
కింది వాటిలో ఉత్పతనం చెందే పదార్థం ఏది? 1) నీరు 2) అయోడిన్ 3) లెడ్ నైట్రేట్ 4) పారాఫిన్ మైనం
భౌతిక మార్పునకు ఉదాహరణ కానిది ఏది? 1) ఇనుమును అయస్కాంతీకరించడం 2) అగ్గిపుల్లను వెలిగించడం 3) కొవ్వొత్తిని వెలిగించడం 4) మంచు నీరుగా మారడం
BaCl2 పై వేడిమి చర్య? 1) రసాయన మార్పు 2) భౌతిక మార్పు 3) రసాయన మార్పు, ద్విగత చర్య 4) భౌతిక మార్పు, ద్విగత చర్య
జతపర్చండి ఎ. pbO 1. పసుపు బి. CuO 2. నలుపు సి. ZnO వేడి 3. తెలుపు డి. ZnO చల్లని 4. పసుపు 1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-1, బి-3, సి-2, డి-4 3) ఎ-1, బి-2, సి-4, డి-3 4) ఎ-4, బి-1, సి- 2, డి-3
కింది వాటిలో అధిక బరువు కలిగి ఉండేది? 1) 1 గ్రాము అణువు ఇనుము 2) 1గ్రాము అణువు హైడ్రోజన్ 3) 1 గ్రాము అణువు సిల్వర్ 4) 1 గ్రాము అణువు సల్ఫర్
నైట్రోజన్ డై ఆక్సైడ్ రంగు ఏది 1) ఆకుపచ్చ 2) తెల్లని దట్టమైన పొగలు 3) జేగురు రంగు 4) పసుపు పచ్చ
A1 నుంచి A13+ ఎప్పుడు ఏర్పడుతుంది? 1) ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు 2) రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు 3) మూడు ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు 4) నాలుగు ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు
సంయోజకతకు సంబంధించి సరికానిది? 1) ఒక మూలక పరమాణువు, సంయోగం చెందగల క్లోరిన్ పరమాణువుల సంఖ్య 2) ఒక మూలక పరమాణువు, సంయోగం చెందగల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 3) సరళ అయాన్ల సంయోజకతల నాలుగో గ్రూప్ వరకు గ్రూప్ సంఖ్యకు సమానంగా ఉంటుంది 4) ఏ మూలకం అయినా ఒకటి కంటే ఎక్కువ సంయోజకతలు ప్రదర్శించదు
కింది ఏ చర్యలో కొత్త పదార్థం ఏర్పడదు? 1) రసాయన ద్వంద్వ వియోగం 2) రసాయన స్థానభ్రంశం 3) రసాయన ఉభయ వియోగం 4) ఏదీకాదు
సోడియం హైడ్రాక్సైడ్ (NaOH) హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCL)తో చర్య చెంది సోడియం క్లోరైడ్, నీటిని ఏర్పరిచే చర్య? 1) రసాయన సంయోగం 2) రసాయన వియోగం 3) రసాయన స్థానభ్రంశం 4) రసాయన ద్వంద్వ వియోగం
ఫ్రాష్.. పద్ధతిలో అల్పసాంద్రత గల నురగ ఏ పదార్థాల కలయిక వల్ల ఏర్పడుతుంది? 1) సల్ఫర్+నీరు 2) వేడిగాలి+నీరు 3) సల్ఫర్ ద్రవం+వేడిగాలి 4) సల్ఫర్ ద్రవం+వేడిగాలి+నీరు
ఫౌంటెన్ ప్రయోగంలో నీలి లిట్మస్ ద్రావణాన్ని ఫౌంటెన్గా ప్రవేశించడానికి కారణం? 1) ఇంక్ పిల్లర్ 2) సల్ఫర్డైఆక్సైడ్ వాయువు 3) నీరు 4) నీటిలో సల్ఫర్డైఆక్సైడ్ చర్య