అఖిల్ హీరోగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. బన్నీవాస్, వాసువర్మ నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. థాంక్స్మీట్ ఆదివారం ఏపీలోని వైజాగ్లో జరిగింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సినిమా ద్వారా దర్శకుడు భాస్కర్ మా సంస్థకు మరో చక్కటి విజయాన్ని అందించాడు. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు చేసింది’ అని పేర్కొన్నారు. ‘భార్యాభర్తల బంధం నిలబడాలంటే ఉండాల్సిన అర్హతలేమిటో అర్థవంతంగా ఆవిష్కరించిన చిత్రమిది. సినిమాలో మేము చెప్పిన సందేశంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు’ అని అల్లు అరవింద్ అన్నారు.