శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 23, 2021 , 13:25:13

ట్రైల‌ర్‌తో రచ్చ చేసేందుకు వ‌స్తున్న 'మోస‌గాళ్ళు'

ట్రైల‌ర్‌తో రచ్చ చేసేందుకు వ‌స్తున్న 'మోస‌గాళ్ళు'

మంచు ఫ్యామిలీ హీరో విష్ణు, కలువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జెఫ్రే గీ చిన్ తెర‌కెక్కిస్తున్న చిత్రం మోస‌గాళ్ళు. ఇందులో విష్ణు సరసన రుహి సింగ్ క‌థ‌నాయిక‌గా న‌టించ‌నుండ‌గా,  కాజల్ అగర్వాల్ హీరో సోదరి పాత్రలో కనిపించనున్నారు.   నవదీప్, సునీల్ శెట్టి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 24ఫ్రేమ్స్ ఫాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్ పతాకాలపై నిర్మిస్తున్నారు. మార్చ్ 19న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.

రిలీజ్‌కు కొద్ది రోజుల స‌మ‌యం ఉండ‌డంతో మేక‌ర్స్ మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 25న చిత్ర ట్రైల‌ర్ విడుదల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ ట్రైల‌ర్ మూవీపై భారీ అంచ‌నాలు పెంచుతుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘మోస‌గాళ్ళు’ చిత్రం రూపొందుతోంది.ఈ సినిమాకు షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ ఈ సినిమాకు అద్భుత‌మైన సంగీతం అందించిన‌ట్టు తెలుస్తుంది.

VIDEOS

logo