శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 03, 2020 , 10:09:31

మోస‌గాళ్ళు టీజ‌ర్ విడుద‌ల చేసిన అల్లు అర్జున్

మోస‌గాళ్ళు టీజ‌ర్ విడుద‌ల చేసిన అల్లు అర్జున్

మంచు విష్ణు  హీరోగా న‌టిస్తోన్న 'మోస‌గాళ్లు' సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా చేస్తున్నారు. ఇప్ప‌టికే టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ను విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేయ‌గా, దానికి అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.తాజాగా చిత్ర టీజ‌ర్‌ను అల్లు అర్జున చేత విడుద‌ల చేయించారు. కొద్ది సేప‌టి క్రితం చిత్ర టీజ‌ర్‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేస్తూ, టీంకు బెస్ట్ విషెస్ అందించారు.  భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ క్రాస్-ఓవ‌ర్ ఫిల్మ్‌ను నిర్మాత‌లు విల‌క్ష‌ణంగా, విస్తృతంగా ప్ర‌మోట్ చేస్తున్నారు. 

భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా 'మోస‌గాళ్లు' చిత్రం రూపొందుతోంది. విష్ణు మంచు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం ఈ చిత్రంలోని విశేషం. బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. 2016లో జరిగిన ఈ 450 మిలియన్ డాలర్ల బిగ్గెస్ట్ స్కామ్ కోసం అగ్ర రాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడ్రెస్ చేస్తున్న స్పీచ్ తో టీజ‌ర్ మొద‌లు కాగా, ఇది సరిపోతుందిగా అని కాజల్ అంటే ఆటిప్పుడే మొదలయ్యింది అని విష్ణు ఈ గ్లింప్స్ ను ఎండ్ చేసాడు.  సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ మరియు మళయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్న‌ట్టు మేక‌ర్స్ తెలిపారు.