శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 25, 2021 , 08:31:08

అనుకోకుండా క‌లిసిన 'గ్యాంగ్ లీడర్' బ్ర‌ద‌ర్స్

అనుకోకుండా క‌లిసిన 'గ్యాంగ్ లీడర్' బ్ర‌ద‌ర్స్

జీఏఎన్‌జీ గ్యాంగ్ గ్యాంగ్ బ‌చావో గ్యాంగ్ గ్యాంగ్..గ్యాంగ్ లీడ‌ర్ అనే పాట ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ పాట ప్లే అయితే ఠ‌క్కున గుర్తొచ్చేది చిరంజీవి. 1991లో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా విజయ బాపినీడు తెర‌కెక్కించిన ఈ చిత్రానికి బ‌ప్పిల‌హ‌రి సంగీతం అందించారు. ఆయ‌న బాణీల‌కు మెగాస్టార్ వేసిన స్టెప్పులు ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రించాయి. 

ఈ చిత్రం రఘుపతి, రాఘవ, రాజారామ్‌ అనే ముగ్గురు అన్నదమ్ముల నేపథ్యంలో తెర‌కెక్క‌గా ఇందులో రఘుపతిగా మురళీమోహన్‌, రాఘవగా శరత్‌కుమార్‌, రాజారామ్‌గా మెగాస్టార్‌ చిరంజీవి నటించారు. వీరు ముగ్గురు త‌మ అద్భుత ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నారు. అయితే ఈ  ముగ్గురు దాదాపు 30 సంవ‌త్స‌రాల త‌ర్వాత క‌ల‌వ‌డ‌మే కాక గ్రూప్ ఫోటో దిగి ప్రేక్ష‌కుల‌కు ఆనందాన్ని అందించారు.  

రామోజీఫిలిం సిటీలో ఈ ముగ్గురు స్టార్స్ సినిమాల‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో అనుకోకుండా క‌లిసారు. అభిమానులకు సంతోషాన్ని పంచాల‌నే ఉద్దేశంతో ఈ ముగ్గురు క‌లిసి ఫొటో దిగి బ‌య‌ట‌కు రిలీజ్ చేశారు. ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. కాగా, చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండ‌గా, ముర‌ళీమోహ‌న్   ఆర్కే మీడియా వారి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక శ‌ర‌త్ కుమార్.. మ‌ణిరత్నం సినిమా షూటింగ్ చేస్తున్నారు 

VIDEOS

logo