కన్నుగీటుతో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది మలయాళ (Mollywood) ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Varrier). ఈ బ్యూటీ కొంతకాలంగా వరుసగా తెలుగులో సినిమా (Telugu Cinema)లు చేసుకుంటూ వెళ్తోంది. అయితే ప్రియా వారియర్ నటించిన తెలుగు సినిమాలకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. అయినా ఈ భామకున్న పాపులారిటీ ముందు సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ ఏమీ లెక్కలోకి రావడం లేదు. దర్శకనిర్మాతలు కూడా ప్రియావారియర్ తమ సినిమాలు తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ప్రియావారియర్ విషయంలో మేకర్స్ పాజిటివ్ గా ఉండటం వెనుక ఓ సీక్రెట్ ఉందట.
ఇంతకీ అదెంటో తెలుసా..? పాపులారిటీ పక్కన పెట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటం వల్లే ప్రియావారియర్ వైపు మేకర్స్ మొగ్గు చూపుతున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం పాపులారిటీ ఉండి చేతిలో సినిమాలు లేని హీరోయిన్లు కూడా సుమారు 40 లక్షలు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రియా వారియర్ తనకు ఎక్కువ పారితోషికం వచ్చే పరిస్థితులున్నా..బడ్జెట్ ఫ్రెండ్లీగా రూ.25 లక్షలు మాత్రమే తీసుకుంటుండమే దీనికి కారణమంటున్నారు పలువురు ట్రేడ్ పండితులు.
ప్రియా వారియర్ నిర్మాతలకు అందుబాటులో ఉండే రెమ్యునరేషన్ ను తీసుకోవడం వల్లే ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీగా ఉందని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం హిందీలో శ్రీదేవి బంగ్లా, కన్నడలో విష్ణు ప్రియ సినిమాలు చేస్తోంది ప్రియా వారియర్.
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్‌లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్