శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 31, 2020 , 15:17:43

సుశాంత్ కు డ‌బ్బు అనేది చాలా చిన్న విష‌యం: అంకిత‌

సుశాంత్ కు డ‌బ్బు అనేది చాలా చిన్న విష‌యం: అంకిత‌

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ను రియా కుటుంబ‌స‌భ్యులు వేధించిన‌ట్టు కోస్టార్, గ‌ర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండే ఆరోపించిన విష‌యం తెలిసిందే. సుశాంత్ గురించి ప‌లు విష‌య‌లు చెప్పింది. సుశాంత్ ఒత్తిడికి లోన‌య్యాడంటే నేను న‌మ్మ‌ను. సుశాంత్ చాలా ఏండ్లుగా నాకు తెలుసు. ఎప్పూడూ నిరాశ చెంద‌డం కానీ, ఒత్తిడికి  కానీ గుర‌వ‌లేదు. ఎంతో శ్ర‌ద్ధ‌తో చాలా క‌ష్ట‌ప‌డి మంచి స్థాయికి ఎదిగాడు. నాకు యాక్టింగ్ లో మెల‌కువ‌లు నేర్పించిన వ్య‌క్తి సుశాంత్‌. సుశాంత్ మ‌ర‌ణం వెనుకున్న కార‌ణాలు తెలియాలంటే ఆస్తులపై ఎంక్వైరీ చేప‌ట్టాల‌ని అంకిత డిమాండ్ చేసింది.

సుశాంత్ సంపాదించిన డ‌బ్బును అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ రియా, కుటుంబ‌స‌భ్యులు దోపిడీ చేశార‌ని అంకిత ఆరోపించింది. సుశాంత్ విష‌యంలో డ‌బ్బు అనేది చాలా చిన్న విష‌యం..ఒక‌వేళ అత‌ని బ్యాంకు ఖాతాలు ఖాళీ అయినా సుశాంత్  ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాదు. మ‌ళ్లీ ధైర్యంగా అన్నీ సంపాదించుకునేవాడు. అందుకే సుశాంత్ మ‌ర‌ణంపై త‌న‌కు చాలా అనుమానాలున్నాయ‌ని అంకిత ఆరోపించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo