గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 00:17:14

డబ్బే ప్రపంచం

డబ్బే ప్రపంచం

‘ప్రపంచంలో జరిగే ప్రతి క్రైమ్‌కి డబ్బు, శృంగారమే కారణం.. ప్రపంచం మొత్తం ఈ రెండింటి చుట్టే తిరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అల్లుకున్న కథ ఇది’ అంటున్నారు దర్శకుడు రాజేంద్రప్రసాద్‌. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సెక్సీస్టార్‌'.  కుప్పిలి శ్రీనివాస్‌, మనీషా పిైళ్లె, బాహుబలి ప్రభాకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కుప్పిలి శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘నేడు సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు అద్దం పట్టే విధంగా వుండే చిత్రమిది. సహజమైన ఆర్టిస్టులతో చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అన్నారు.