మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 20, 2020 , 09:29:23

అభికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోనాల్ సోద‌రి

అభికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోనాల్ సోద‌రి

ఇంటి స‌భ్యుల రాక‌తో ఈ వారం బిగ్ బాస్ కార్య‌క్ర‌మం చాలా ఎమోష‌న‌ల్‌గా సాగుతూ పోతుంది. అరియానా ఫ్రెండ్ వినిత్ బ‌య‌ట‌కు వెళ్లాక బిగ్ బాస్ మోనాల్ మ‌ద‌ర్ వాయిస్ వినిపించారు. ‘మోనాల్ పాపా ఎలా ఉన్నావు.. మేం ఇక్కడ బాగున్నాం.. నువ్వు బాగా ఆడుతున్నావు.. అలాగే ఆడు.. రోజూ నిన్ను టీవీలో చూస్తున్నాం. మేము హైదరాబాద్ రాలేకపోయాం.. మా గురించి ఆలోచించకు.. మంచిగా ఆడి.. అందరితో మంచిగా ఆడు’ అంటూ మోనాల్ తల్లి త‌న సందేశాన్ని వినిపించింది. ఇది విన్న మోనాల్ త‌న త‌ర‌పున ఎవ‌రు రార‌నుకొని బాత్‌రూంలోకి వెళ్లి కొట్టుకుంది.

బయ‌ట‌కు వ‌చ్చాక బిగ్ బాస్‌కు వార్నింగ్ ఇచ్చింది. నా ఎమోష‌న్స్‌తో ఆడుకుంటున్నావ్‌. కోపం వ‌స్తుంది బిగ్ బాస్ . ఏదో ఒక‌టి చెప్పు అంటూ అరిచేసింది. ఇంతలోనే మోనాల్ సోద‌రి హేమాలి ఇంట్లోకి అడుగుపెట్టింది. సిస్ట‌ర్‌ని చూసి మోనాల్ క‌న్నీళ్ళు పెట్టుకుంది. ఇద్ద‌రు కొద్ది సేపు హిందీలో మ‌రి కొద్ది సేపు గుజ‌రాతీ భాష‌లో మాట్లాడుకున్నారు. కునాల్‌తో మాట్లాడావా?? నా గురించి అఖిల్ గురించి బయట చెడుగా అనుకోవట్లేదు కదా’ అని తన సిస్టర్‌ని అడిగింది మోనాల్. నువ్వు స్ట్రాంగ్‌గా ఉండు, మంచి గేమ్ ఆడు విన్న‌ర్ అవుతావు అంటూ ధైర్యం అందించింది.

ఇక అభిజిత్‌తో మాట్లాడిన హేమాలి.. ఏదైన ఉంటే స్ట్రైట్‌గా చెప్పు. వెనుక మాట్లాడొద్దు. ఎక్కువ‌గా త‌న‌తో మాట్లాడు అని స‌ల‌హ ఇచ్చింది. ఇందుకు అభి ఓకే అన్న‌ట్టు త‌ల ఊపాడు . ఇక మోనాల్‌ని ప‌దేప‌దే ఏడ‌వొద్దంటూ చెప్పిన హేమాలి అందరికి బై చెబుతూ హౌజ్‌ని వీడింది. మోనాల్ అక్క హేమాలి.. అభిజీత్ పై సెటైర్లు వేయడం గురించి హారిక‌, లాస్య‌, అవినాష్ మ‌ధ్య డిస్క‌ష‌న్ జ‌రిగింది. ముందు ఏం మాట్లాడ‌తాడో వెనుక కూడా అభి అదే మాట్లాడ‌తాడు అంటూ క‌వర్ చేసింది.


logo