మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 10:14:47

అఖిల్‌, అభిజిత్‌ల‌తో ఎమోష‌న‌ల్ గేమ్ ఆడుతున్న ‌మోనాల్

అఖిల్‌, అభిజిత్‌ల‌తో ఎమోష‌న‌ల్ గేమ్ ఆడుతున్న ‌మోనాల్

గుజరాతీ అమ్మాయి మోనాల్ గ‌జ్జ‌ర్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన‌‌ప్పుడు చాలా అమాయ‌కంగా కనిపించింది, చిన్న విష‌యాల‌కు కూడా చాలా ఎమోష‌న‌ల్ అయింది. మోనాల్ ప్ర‌వ‌ర్త‌న‌కు విసుగు చెందిన నెటిజ‌న్స్  ఎక్కువ రోజులు ఈమె ఇంట్లో ఉండ‌క‌పోవ‌చ్చు అని జోస్యాలు చెప్పారు . కాని అంద‌రి త‌ల‌కిందులు చేస్తూ ఎమోష‌న‌ల్ గేమ్ ఆడుతుంది మోనాల్. అభిజిత్‌, అఖిల్‌తో మైండ్ గేమ్ ఆడుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

నామినేష‌న్ ప్ర‌క్రియ స‌మ‌యంలో అఖిల్.. మోనాల్ పేరు తీసుకురావ‌డంతో అభిజిత్ కూడా మోనాల్‌తో త‌నుకున్న ర్యాపో గురించి మాట్లాడాడు. ఇద్ద‌రి మ‌ధ్య జరిగిన చ‌ర్చ ర‌చ్చ‌కు దారి తీయ‌డంతో మోనాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నా పేరుని ఎందుకు తీస్తున్నారు అంటూ గ‌రం అయింది. ఇదంతా జ‌రిగిన త‌ర్వాత అఖిల్, అభిలు విడివిడిగా ఆమెకు సారీలు చెప్పారు. అయితే మోనాల్ కాస్త క‌న్నింగ్ గేమ్ ఆడుతున్న‌ట్టు అభిజిత్ నిన్న‌టి ఎపిసోడ్‌లో పేర్కొన్నాడు.

నామినేష‌న్స్ అప్పుడు జ‌రిగిన గొడ‌వ‌లో అఖిల్‌దే త‌ప్పు అని మోనాల్ నాకు వ‌చ్చి చెప్పింది, ఈ విష‌యం అఖిల్‌కు తెలుసో లేదో నాకు తెలియ‌దు అని అభిజిత్ అన్నాడు. అయితే మాతో కూడా మోనాల్ అదే అంటుంది క‌దా అని నాగ్ అన‌డంతో టాపిక్ అక్క‌డ క్లోజ్ అయింది. అయితే ఏదో విష‌యంలో మోనాల్‌, అఖిల్ మ‌ధ్య కాస్త దూరం పెర‌గగా, ఈ విష‌యాన్ని కూడా నాగ్ చర్చించారు. నాకు కొంత ఇబ్బందిగా ఉన్న కార‌ణంగా మోనాల్‌తో మాట్లాడ‌ట్లేదు అని అఖిల్ అన‌డంతో నాగార్జున‌.. మాట్లాడ‌కుండా ఉంటే సొల్యూష‌న్ ఎలా వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించాడు.

అయితే అంత‌క‌ముందు సోఫాలో ప‌డుకున్న మోనాల్‌, అఖిల్ చాలా డీప్‌గా డిస్క‌ష‌న్స్ జ‌రిపారు. చేతిలో చేయి వేస‌కొని ఇద్ద‌రు మాట్లాడుతున్న స‌మ‌యంలో అభి వ‌చ్చి మోనాల్‌కు టిష్యూస్ ఇచ్చాడు. అప్పుడు అఖిల్‌ని చూసి ఓ న‌వ్వు న‌వ్వింది మోనాల్. ఇవన్నీ చూస్తుంటే నీకు మజా వస్తుంది కానీ.. నాకు చాలా గలీజ్‌గా ఉంది.. నిన్ను చూసి పాపం అనుకోవడం కాదు.. నన్ను చూసి పాపం అనుకోవాలి.. నా గురించి ఎవడూ ఆలోచించడు అని మోనాల్‌తో అన్నాడు అఖిల్.

నువ్వు రాంగ్ రూట్‌లో వెళుతున్నావు, కొత్త ఫ్రెండ్స్ రావ‌డంతో న‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు అని మోనాల్ అన‌డంతో నాకు అంద‌రు ఫ్రెండ్సే, నీ ద‌గ్గ‌ర నాకు ఏది కూడా స్పెష‌ల్ గా క‌నిపించ‌డం లేదు అందుకే నిన్ను స్పెష‌ల్ గా చూడ‌డం లేదు అని అఖిల్ అన్నాడు.  అయితే అక్క‌డ నుండి అఖిల్ లేచి వెళ్ళ‌బోతున్న స‌మ‌యంలో వ‌ద్దు ఇక్కడే కూర్చో అంటూ కాస్త గారాబం  చేసింది మోనాల్. నాకు హెల్త్ బాగోలేన‌ప్పుడు నా ప‌క్క‌న నువ్వు ప‌ది నిమిషాలు కూర్చుంటే బెట‌ర్‌గా ఉంటుంది. నువ్వు నా మెడిస‌న్ అని మోనాల్ అన‌డంతో, ఈ మెడిసిన్ ఎక్స్‌పైరీ అయిందంటూ పంచ్ వేశాడు అఖిల్. మొత్తానికి మోనాల్ ప్ర‌వ‌ర్త‌న అంద‌రిని అయోమ‌యానికి గురి చేస్తుంది. 


logo