బిగ్ బాస్ షోతో ఫుల్ క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్స్‌లో మోనాల్ కూడా ఒకరు. హౌజ్‌లో ఉన్నప్పుడు అభిజిత్, అఖిల్‌తో సన్నిహితంగా మెలుగుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాల్‌కి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. టీవీ షోసే కాక సినిమా ఆఫర్స్ కూడా అందుకుంటుంది.
సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే మోనాల్ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇప్పుడు నాకు ఒక ఇల్లు దొరికింది. నేను కూడా అఫీషియల్‌గా హైదరాబాదీని అయ్యాను. జై శ్రీకృష్ణా.. గోవిందా గోవిందా’అంటూ పోస్ట్ చేసింది.