బుధవారం 20 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 09:09:23

అవినాష్‌ని కూల్ చేసేందుకు ముద్దిచ్చిన మోనాల్

అవినాష్‌ని కూల్ చేసేందుకు ముద్దిచ్చిన మోనాల్

బిగ్ బాస్ సీజ‌న్ 4 ఆట మ‌రో మూడు వారాలే మిగిలింది. టికెట్ టు ఫినాలే మెడల్ కోసం ర‌స‌వ‌త్త‌ర పోరు న‌డుస్తుంది రెండో దశకు చేరుకోవడంతో హౌస్‌లో ఉన్న ఏడుగురిలో సొహైల్, అఖిల్, అభిజిత్, హారికలు లెవల్ 2కి అర్హత సాధించారు. బుధవారం నాటి 88 ఎపిసోడ్‌లో లెవ‌ల్ 3కు ఎవ‌రు వెళ్ళారు , హౌజ్‌లో ఏం జ‌రిగిందో ఈ స్టోరీలో చూద్దాం.  ఎపిసోడ్ మొద‌ట్లో త‌న టాస్క్‌ని డిస్ట్ర‌బ్ చేయ‌డం ప‌ట్ల తెగ ఆవేద‌న చెందాడు అవినాష్ .అఖిల్‌, సోహైల్ క‌లిసి ఆడటం వ‌ల్ల త‌న‌ గేమ్ డిస్ట‌ర్బ్ అయింద‌ని ఆవేద‌న చెందాడు. మోనాల్ త‌న్న‌డం వ‌ల్ల మ‌రింత‌ హ‌ర్ట్ అయ్యాన‌ని చెప్పాడు అవినాష్.

మోనాల్ కాలుతో తంతే మ‌ళ్లీ ఆమెతో మాట్లాడ‌న‌ని అన్న సోహైల్ ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి కూడా క్లారిటీ తీసుకున్నాడు. త‌ర్వాత త‌న్నిన‌ట్టు తెలిస్తే ఒక్క‌టి ఇస్తా అని ఆమె నుండి నిజం రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే క్లారిటీ లేని మోనాల్ ఓ సారి వీడియో చూపించ‌మ‌ని కోరింది.  బిగ్ బాస్ క‌రుణించ‌లేదు.  దీంతో డైరెక్ట్‌గా అవినాష్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళి క్ష‌మించ‌మ‌ని కోరింది. కావాల‌ని త‌న్న‌లేదు. నా మ‌నస్పూర్తిగా క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాను అంటూ అవినాష్ కాళ్ళు ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఇది ఎలానో వెళుతుంది అంటూ అవినాష్ కూడా మోనాల్ క‌ళ్లు ప‌ట్టుకోబోయాడు. 

అవినాష్‌ని కూల్ చేసేందుకు అత‌ని బుగ్గ‌పై ముద్దిచ్చింది మోనాల్‌. అనంత‌రం అక్క‌డికి వచ్చిన అరియానా ముందు మ‌రోసారి ముద్దు పెట్టింది. ఆ త‌ర్వాత ముగ్గురు క‌లిసి కౌగిలిలో బంధీ అయ్యారు. అనంతంరం ప‌క్క‌కు వెళ్లిన అరియానా, అవినాష్‌లు మోనాల్ గురించి మాట్లాడుకోసాగారు.


logo