శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 11, 2020 , 13:10:21

మోనాల్ చిన్న ‌విష‌యానికి కూడా ఏడుస్తుంది..

మోనాల్ చిన్న ‌విష‌యానికి కూడా ఏడుస్తుంది..

గంగ‌వ్వ మాట‌లతో కాస్త వినోదాత్మ‌కంగా సాగిన నాలుగో ఎపిసోడ్‌..గంగ‌వ్వ త‌న పంచ్‌ల‌తో నోయ‌ల్‌తో పాటు అరియానా, దేత్త‌డి హారిక‌ల‌కు త‌న‌దైన శైలిలో  చుర‌కలు అంటించింది. ఇక ఐదో ఎసిసోడ్ విష‌యానికొస్తే..ఇంట్లో జ‌రుగుతున్న అల్ల‌ర‌చిల్ల‌ర చేష్ట‌ల‌కు బిగ్ బాస్ ఫుల్ స్టాప్ పెట్టాడు. కంటెస్టెంట్ల‌తో ఫిజిక‌ల్ టాస్క్ ఆడించాడు. బిగ్ బాస్ తొలి టాస్క్ ఇచ్చినందు వ‌ల్ల..సభ్యులు త‌మ శ‌క్తిమేర‌కు టాస్క్ లో పాల్గొని పోటీ ప‌డ్డారు. 


దివికి టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్‌

మార్నింగ్ మ‌స్తీలో బిగ్ బాస్ దివికి టాస్క్ ఇచ్చాడు. దివి ఇంటిస‌భ్యుల‌ను ఏ విష‌యంలో మార్చాల‌నుకుంటుందో చెప్పాల‌ని సూచించాడు. దీంతో టాస్క్ షురూ చేసిన దివి అఖిల్ మోడ‌ల్ అని..వాకింగ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది..కాబ‌ట్టి న‌డ‌క స్టైల్ ను మార్చుకుంటే మంచిద‌ని దివి చెప్పింది. ప‌క్క‌వాళ్లు ఏడిస్తే క‌న్నీరు పెట్టుకోవ‌ద్ద‌ని గంగ‌వ్వ‌కు దివి సూచించింది. ఏడ‌వొద్దంటే త‌న వ‌ల్ల కాద‌ని కాస్త రాష్‌గా జ‌వాబివ్వ‌గా..గంగ‌వ్వ ఏడిస్తే తామెవ్వ‌ర‌మూ చూడ‌లేమంటూ అవ్వ‌ను ఊరుకోబెట్టారు.  అనంత‌రం అభిజిత్ కోపం త‌గ్గించుకుంటే బాగుంటుంద‌ని దివి స‌ల‌హా ఇచ్చింది. మ‌రోవైపు లాస్య సెన్సెటివ్ అని చెప్ప‌గా..తాను సెన్సెటివ్ కాద‌ని సమాధాన‌మిచ్చింది.హారిక అంద‌రినీ నువ్వు అంటూ పిలుస్తుంద‌ని, కొంద‌రికైనా గౌర‌వం ఇచ్చి మాట్లాడితే మంచిద‌ని దివి సూచించింది.

దేవినాగ‌వ‌ల్లి అప్పుడే హైప‌ర్ గా ఉంటూ..వెంట‌నే డ‌ల్ అయిపోతారు. అందుకే ఆమె ఎన‌ర్జీ ఎప్పుడూ ఒకే ఉంచుకోవాల‌ని దివి సూచింది. మోనాల్ చిన్న విష‌యానికి కూడా ఏడుస్తుంద‌ని, ప్ర‌తీ చిన్న దానికి ఏడ‌వొద్ద‌ని చెప్పింది. క‌ళ్యాణి కొన్ని విష‌యాల్లో అతిగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీన్ని త‌గ్గించి తొంద‌ర‌ప‌డ‌కుండా ఉంటే మంచిద‌ని సూచించింది. సూర్య‌కిర‌ణ్ ప్ర‌తీది ప‌ర్ ఫెక్ట్ గా చెప్తున్న‌రు కానీ నా మాటే వినాల‌డం త‌గ్గించుకోవాల‌ని చెప్ప‌గా..నేను త‌గ్గించ‌ను అంటూ బిల్డ‌ప్ ఇచ్చి ఓ న‌వ్వు న‌వ్వాడు సూర్యకిర‌ణ్‌. అంద‌రికీ న‌చ్చిన వ్య‌క్తి అమ్మరాజ‌శేఖ‌ర్ అని. అయితే కుళ్లు జోకులు ఆపేస్తే మంచిద‌ని దివి చెప్పుకొచ్చింది. క‌ట్ట‌ప్ప వ‌ల్ల‌నేన‌న్న బిగ్‌బాస్‌..క‌ట్ట‌ప్పే లేర‌న్న దేవి

అనంత‌రం బిగ్ బాస్ అరియానా, సోహైల్ ను క‌న్ఫెష‌న్ లో రూమ్ లోకి ర‌మ్మ‌న్నాడు. క‌ట్ట‌ప్ప వెన్నుపోటు పొడిచి ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ ను చెడగొట్టాడ‌ని, ఇంటి సభ్యులు ఎవ‌రినీ క‌ట్ట‌ప్ప అనుకుంటున్నారో, దానికి గ‌ల కార‌ణాలేంటో తెలుసుకోవాల‌ని బిగ్ బాస్ నిర్దేశించాడు. సోహైల్ ఇదే విష‌యాన్ని మిగిలిన ఇంటి స‌భ్యుల‌కు సూచించ‌గా..వారు ఆ మాట‌లను న‌మ్మ‌క‌పోగా..ఇదేదో కొత్త టాస్క్ అని అనుమాన‌పడ్డారు. క‌ట్ట‌ప్ప ఎవ‌ర‌నే విష‌యంపై నిన్న‌నే చీటీ రాశామ‌ని, ఇప్పుడు మ‌రోసారి కొత్త‌గా చెప్ప‌మ‌ని ఖ‌రాఖండిగా చెప్పేశారు. ఇంటి స‌భ్యుల ఆలోచ‌న‌న‌ను క‌ట్ట‌ప్ప ప్ర‌భావితం చేస్తున్న‌ట్టు గ్ర‌హించిన సూర్య‌కిర‌ణ్‌.. అరియానా, సోహైల్ ద‌గ్గ‌ర‌కెళ్లి అఖిలే క‌ట్ట‌ప్ప అనుకుంటున్నాన‌ని చెప్పాడు. ఇక మ‌రోవైపు గంగ‌వ్వ కూడా అఖిల్ పేరు చెప్పుకొచ్చింది. దివి, మెహ‌బూబ్ లాస్య పేరును, అమ్మ‌రాజశేఖ‌ర్ నోయ‌ల్ పేరును వెల్ల‌డించారు. అయితే ఇంట్లో అస‌లు క‌ట్ట‌ప్ప ఎవ‌రూ లేర‌ని దేవి నాగ‌వ‌ల్లి పేర్కొంది. మిగిలిన ఇంటిస‌భ్యులు మాత్రం త‌మ అభిప్రాయాలు వెల్ల‌డించేంముందుకు రాలేదు. 

తొలి ఫిజిక‌ల్ టాస్క్‌..టీమ్స్ గా ఏర్ప‌డి పోటీ

బిగ్ బాస్ హౌజ్ లో తొలి ఫిజిక‌ల్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ కు అరియానా, సోహైల్ క్వాలిటీ చెక్ మేనేజ‌ర్లుగా, గంగ‌వ్వ అసిస్టెంట్ గా వ్య‌వ‌హ‌రించింది. సూర్య‌కిర‌ణ్ సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. అలాగే అభిజిత్‌, సుజాత, క‌ళ్యాణి బ్లూ టీమ్ గా, మెహ‌బూబ్, దివి, దేవి నాగ‌వ‌ల్లి ఎల్లో టీమ్ గా, మోనాల్‌, లాస్య‌, అఖిల్ గ్రీన్ టీమ్ గా, నోయ‌ల్, హారిక‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ ఆరెంజ్ టీమ్ గా డివైడ్ అయ్యారు. ఆ త‌ర్వాత సైర‌న్ వినిపించ‌గానే గార్డెన్ ప్రాంతంలో ఉన్న క‌న్వెయ‌ర్ బెల్ట్ ద్వారా వ‌చ్చే వ‌స్తువుల కోసం టీం మెంబ‌ర్స్ పోటీ ప‌డ్డారు. అమ్మ‌రాజ‌శేఖ‌ర్, అఖిల్ త‌మ‌దైన స్టైల్ లో తెలివిగా ఆట‌ను ఆడ‌గా...అభిజిత్ మాత్రం ఆట‌లో త‌ట‌ప‌టాయించాడు. మ‌రోవైపు లాస్య‌, నోయ‌ల్ మాత్రం ట‌మోటాల కోసం త‌గువులాడుకున్నంత ప‌ని చేశారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఈ గేమ్ లో ఎవ‌రు గెలుస్తార‌నేది త‌ర్వాత ఎపిసోడ్ లో తెలియ‌నుంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo