మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 15:31:33

వాడివేడిగా నామినేషన్స్ ప్రక్రియ.. అవినాష్‌పై అరిచిన మోనాల్

వాడివేడిగా నామినేషన్స్ ప్రక్రియ.. అవినాష్‌పై అరిచిన మోనాల్

సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ రచ్చ మొదలైపోయింది బిగ్ బాస్ హౌజ్‌లో. గతవారం మాత్రమే చాలా కూల్ గా ఎలాంటి గొడవలు లేకుండా పూర్తి చేసాడు బిగ్ బాస్. అప్పుడు ఆయనే స్వయంగా నామినేట్ చేసాడు కాబట్టి రచ్చ లేదు. కానీ ఈ సారి అలా కాదు.. మీలో మీరు తన్నుకుచావండి అంటూ తాంబూలాలు ఇచ్చి వదిలేసాడు. దాంతో మరోసారి మన కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. నామినేషన ప్రక్రియలో భాగంగా అందరికీ కొన్ని రంగులను ఇచ్చి.. ఎవర్ని అయితే నామినేట్ చేయాలనుకున్నారో ఆ రంగును తీసుకెళ్లి వాళ్ల సీసాలో పోయమని మరో ఐడియాతో వచ్చాడు బిగ్ బాస్. అనుకున్నట్లుగానే ఈ వారం కూడా అవినాష్, అభిజీత్, అఖిల్ తో పాటు మరో ఇద్దరు కూడా నామినేట్ అయ్యేలా కనిపిస్తున్నారు. 

ప్రక్రియ మొదలైన వెంటనే రచ్చ కూడా మొదలైపోయింది. హారిక ఈ సారి చాలా విచిత్రంగా అభిజీత్ ను నామినేట్ చేసింది. మరోవైపు మోనాల్ కూడా వెళ్లి అఖిల్ ను నామినేట్ చేసింది. బుర్ర పెట్టి ఆడు గేమ్ అని అఖిల్ అంటుంటే కాదు హార్ట్ తో ఆడతానంటూ సమాధానమిచ్చింది మోనాల్. దాంతో అందరి ముందు నన్ను బ్యాడ్ చేస్తున్నావా అంటూ అఖిల్ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత అరియానా వచ్చి మోనాల్ ను నామినేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది. కానీ మోనాల్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అవినాష్ కలగచేసుకుని తెలుగులో మాట్లాడమని సూచించాడు. 

దానికి మోనాల్ కు చిర్రెత్తుకొచ్చింది. మధ్యలో మాట్లాడకు అంటూ అవినాష్ పై అంతెత్తుత లేచింది ఈ భామ. అంతకుముందు అవినాష్, అఖిల్ మధ్య కూడా వాదన జరిగింది. ఈ ఇంట్లో తనకంటే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నపుడు తనెందుకు ఎలిమినేట్ కావాలంటూ చెప్పాడు అవినాష్. అది నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా అంటూ అఖిల్ సీరియస్ అయ్యాడు. ఏదేమైనా కూడా ఈ వారం కూడా నామినేషన్ ప్రక్రియ అయితే వాడివేడిగానే ముగిసింది. మరి ఆట ఎలా ఉండబోతుందో చూడాలి.logo