గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 10:26:17

అఖిల్‌- మోనాల్ మ‌ధ్య ర‌చ్చ‌.. ఫుల్ ఫైర్ అయిన గుజ‌రాతీ భామ‌

అఖిల్‌- మోనాల్ మ‌ధ్య ర‌చ్చ‌.. ఫుల్ ఫైర్ అయిన గుజ‌రాతీ భామ‌

నామినేష‌న్ ప్ర‌క్రియ అంటే మిత్రులు శత్రువులుగా మార‌డం ఖాయం. ఈ వారం నామినేష‌న్ వ‌ల‌న ప్రేమ ప‌క్షులులా ఉన్న అఖిల్- మోనాల్ మ‌ధ్య దూరం ఏర్ప‌డేలా క‌నిపిస్తుంది. 13వ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా అఖిల్‌.. అవినాష్‌, మోనాల్‌ల‌ని నామినేట్ చేశాడు. అవినాష్ సేవ్ అయిన త‌ర్వాత అంత‌లా ఫీల‌వ్వ‌డం క‌రెక్ట్ కాదు. కాస్త ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ నీకు ఎక్కువైన‌ట్టు అనిపిస్తుంద‌ని చెప్పి అత‌నిని నామినేట్ చేశాడు అఖిల్.

ఇక నువ్వు కెప్టెన్సీ వ‌ర‌కు రీచ్ కాలేక‌పోయావు. కాస్త ఎఫ‌ర్ట్స్ పెట్టాలి అంటూ మోనాల్‌ని నామినేట్ చేశాడు అఖిల్‌. ఇక అఖిల్‌ది పూర్త‌య్యాక మోనాల్ ముగ్గురిని నామినేట్ చేసింది అభిజిత్‌, అవినాష్‌, అఖిల్‌ల బౌల్స్‌లో రంగు నీళ్ళు పోసింది. అబి నువ్వు నా వ‌ల‌న డిస్ట్ర‌బ్ అవుతున్నా అంటున్నావ్ అది నా ప్రాబ్ల‌మ్ కాదు. నీకు నేను దూరంగానే ఉంటున్నా అని చెప్పుకొచ్చింది. ఇది అభి కూడా యాక్సెప్ట్ చేశాడు. ఇక మోనాల్ .. అఖిల్ మ‌ధ్య కాసేపు వార్ న‌డిచింది. నేను ఎందుకు గేమ్ ఆడ‌లేక‌పోతున్నానో మీకు తెలుసు అని మోనాల్ అంటే నేను చెప్పేది దిమాగ్‌తో ఆడ‌మ‌ని. బ్రెయిన్ పెట్టి ఆడితే బాగుంటుంద‌ని అనిపిస్తుంద‌ని అఖిల్ అన్నాడు. దీనికి మోనాల్‌.. ‘మీరు బ్రెయిన్‌తో గేమ్ ఆడతారు.. నేను హార్ట్‌తో గేమ్ ఆడతాను అని అఖిల్‌కి దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. దీంతో మ‌నోడు త‌న హార్ట్‌తో ఆడి ఎన్ని త్యాగాలు చేశాడో చెప్పుకొచ్చాడు.

నేను నిజంగా హార్ట్‌తో ఆడి ఉంటే.. 8 వారాల వరకూ ఆగేవాడిని కాదు. నువ్ అనుకున్నట్టు నేను బ్రెయిన్ పెట్టి ఆడి ఉంటే.. నిన్ను సెకండ్ వీక్‌లోనే నామినేట్ చేసేవాడిని. అదీ నా హార్ట్ అంటే.. ఇదీ నీ బ్రెయిన్. న‌న్ను నామినేట్ చేయ‌న‌ని ప్రామిస్ చేశావ్. ఇంకెప్పుడు నువ్వు ప్రామిస్‌లు చేయ‌కు మోనాల్ అని అఖిల్ అన‌డంతో మీరే చెప్పారు క‌దా ఎవ‌రి గేమ్ వాళ్లు ఆడ‌దాం అని మోనాల్ పేర్కొంది


logo