శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 15, 2020 , 12:20:41

షారూక్ కూతురి ఫోటోషూట్‌.. పిక్స్ తీసిన గౌరీఖాన్‌

షారూక్ కూతురి ఫోటోషూట్‌..  పిక్స్ తీసిన గౌరీఖాన్‌


హైద‌రాబాద్‌: బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌.. లాక్‌డౌన్ వేళ ఫోటోషూట్‌లో పాల్గొన్న‌ది. వాస్త‌వానికి అదేమీ ప్రొఫెష‌న‌ల్ ఫోటోషూట్ కాదు.  కానీ ఆ ఫోటోల‌ను త‌ల్లి గౌరీఖాన్ తీయ‌డం విశేషం.   చాలా సింపుల్‌గా ఉన్న సుహానా.. కొన్ని స్టిల్స్‌తో ఆక‌ట్టుకున్న‌ది.  గౌరీ ఖాన్ కూడా ఓ ఫ్రొఫెష‌న‌ల్ త‌ర‌హాలో త‌న కూతుర్ని ఫోటోషూట్ చేసింది. సుహానా త‌న ఫోట‌లోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.  బాలీవుడ్ ప్లాన్స్‌పై ఇంకా సుహానా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.  కానీ ఫోటోషూట్‌లో మాత్రం ఆ క్యూటీ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. 

ఇక ఎప్పుడూ షోబిజ్‌లోకి ఎంట్రీ ఇస్తుందో అని ఆమె అభిమానులు వెయిట్ చేస్తున్నారు. గౌరీ ముద్దుల కూతురు సుహానా.. ప్ర‌స్తుతం న్యూయార్క్ వ‌ర్సిటీలో యాక్టింగ్ కోర్సు చ‌దువుతున్న‌ది. ఏడాది క్రిత‌మే ఆమె ఈ కోర్సులో చేరింది. ఇంగ్లండ్‌లోని అర్డింగ్లీ కాలేజీ నుంచి సుహానా త‌న గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకున్న‌ది. క‌చ్చితంగా సినిమాల్లోకి సుహానా ఎంట్రీ ఇస్తుంద‌న్న విష‌యం తాజా ఫోటో షూట్‌తో రుజువైంది.

 


View this post on Instagram

my mum took these ???? @gaurikhan

A post shared by Suhana Khan (@suhanakhan2) on


logo