కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో ఆయన. ఎలాంటి పాత్రలోనైనా లీనమైపోయే టాలెంట్ ఆయన సొంతం. ఎప్పటికపుడు తన బాడీ లాంగ్వేజ్, లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కుర్రహీరోలకు గట్టిపోటీనిస్తుంటారు. ఇంతకీ ఆయనెవరనుకుంటున్నారా..? మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి. 69 ఏండ్ల వయస్సులో కూడా ఈ స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తున్న స్టిల్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
పోనీ టెయిల్ లుక్ లో దిగిన స్టిల్ ను మమ్ముట్టి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. చిన్న పోనీ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక బ్రైట్ యెల్లో షర్ట్‌లో ఉన్న మమ్ముట్టి నయా స్టైలిష్ పోనీ టెయిల్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మమ్ముట్టి నటిస్తున్న భీష్మ పర్వం సినిమా ప్రిపరేషన్ కోసమే ఈ కొత్త గెటప్ లో కనిపిస్తున్నారంటూ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. మమ్ముట్టి నయా లుక్ ఇపుడు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది. మమ్ముట్టి ప్రస్తుతం సీబీఐ 5, బిలాల్‌తోపాటు మరో సినిమా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?