శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 16:41:22

మోస‌గాళ్లు నుంచి 'మోహినీ' లుక్

మోస‌గాళ్లు నుంచి 'మోహినీ' లుక్

మంచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న‌ చిత్రం మోస‌గాళ్లు. హాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత జాఫ్రే చిన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి రూహీ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. తాజాగా చిత్ర‌యూనిట్ హీరోయిన్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో రూహీ సింగ్ మోహ‌నీ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మోహినీ రోల్ లో న‌టించ‌డం చాలా ఫ‌న్ గా సాగింది..అంటూ బ్లాక్ షార్ట్ డ్రెస్ లో ఉన్న‌ ఫ‌స్ట్ లుక్ ను ట్విట‌ర్ ద్వారా షేర్ చేసింది రూహీసింగ్‌. 

బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, రుహాని శ‌ర్మ, న‌వదీప్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు..కొన్ని సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన ప్ర‌పంచంలోనే పెద్ద ఐటీ స్కాం నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. మోస‌గాళ్లు ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం జూన్ 5న ఇండియాలో, జులైలో హాలీవుడ్ లో విడుద‌ల కావాల్సి ఉండ‌గా..క‌రోనా ప్ర‌భావం నేప‌థ్యంలో విడుద‌ల వాయిదా ప‌డ్డ‌ది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు