గురువారం 28 మే 2020
Cinema - May 22, 2020 , 08:49:19

మ‌హేష్‌, చిరుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మోహన్ లాల్

మ‌హేష్‌, చిరుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మోహన్ లాల్

మ‌ల‌యాళ మెగాస్టార్  మోహ‌న్ లాల్ మే 21న 60వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అన్ని భాష‌ల‌కి చెందిన ప్ర‌ముఖులు మోహ‌న్‌లాల్‌కి శుభాకాంక్ష‌లు అందించారు. చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా మోహ‌న్‌లాల్‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ.. 60 వ పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియమైన లాలెట్టన్  మోహన్ లాల్. మా కాలంలో మీలాంటి  లెజెండ్ ఉండ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. మీరు ఇలాగే ఇంకా చాలా ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరిస్తూ, అందరిలో స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నా అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

చిరు ట్వీట్‌కి స్పందించిన మోహ‌న్ లాల్‌.. ప్రియ‌మైన చిరంజీవి గారు,నా బ‌ర్త్‌డేకి శుభాకాంక్ష‌లు తెలిపిన మీకు ధ‌న్య‌వాదాలు. మీ ప్రేమ‌, అభిమానం, ద‌య‌గ‌ల మాట‌లు న‌న్ను చాలా సంతోష‌ప‌ర‌చాయి అని అన్నారు. ఇక మ‌హేష్ కూడా మోహ‌న్‌లాల్‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేడంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు లాలెట్ట‌న్


logo