శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 21, 2020 , 22:59:34

రెండో ‘దృశ్యం’

రెండో ‘దృశ్యం’

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా 2013లో  రూపొందిన మలయాళ చిత్రం ‘దృశ్యం’  బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది. కుటుంబ విలువలు, మర్డర్‌ మిస్టరీ అంశాల కలబోతగా ఉత్కంఠభరితంగా దర్శకుడు జీతూజోసఫ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.  ఇందులో మధ్యతరగతి తండ్రిగా మోహన్‌లాల్‌ అభినయానికి  ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ చిత్రానికి  సీక్వెల్‌ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం మోహన్‌లాల్‌ ‘దృశ్యం-2’  ప్రకటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సీక్వెల్‌కు జీతూ జోసఫ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఆంటోనీ పెరంబవూర్‌ నిర్మించనున్నారు.  దక్షిణాదికి చెందిన చిరంజీవి, కమల్‌హాసన్‌, మమ్ముట్టి తదితర సినీ ప్రముఖులు మోహన్‌లాల్‌కు జన్మదిన శుభాకాంక్షలందజేశారు.logo