సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 01, 2020 , 13:50:41

గాల్వ‌న్ నేపథ్యంలో మోహన్‌లాల్ సినిమా..!

గాల్వ‌న్ నేపథ్యంలో మోహన్‌లాల్ సినిమా..!

హైదరాబాద్‌ : గాల్వ‌న్ కథ ఆధారంగా రాబోయే చిత్రంలో మోహన్‌లాల్ హిరోగా నటిస్టున్నారు. ప్ర‌స్తుతం భార‌త్‌, చైనా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త‌, యుద్ధ వాతావ‌ర‌ణ‌ ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల గాల్వ‌న్ లోయ‌లో భార‌త్‌, చైనా సైనికులు మ‌ధ్య జ‌రిగిన ఘర్షణలో భారత జవాన్లు ఇర‌వై మంది వీర మరణం పొందారు. దీంతో దేశ వ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నారు. భారత్‌ ప్రస్తుతం చైనాకు చెందిన యాప్‌లను కూడా నిషేదించారు. ఇలాంటి నేప‌థ్యాన్ని ఆధారంగా చేసుకుని ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు మేజ‌ర్ ర‌వి ఓ సినిమాను రూపొందించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

‘బ్రిడ్జ్ ఆఫ్ గాల్వ‌న్‌’ పేరుతో రూపొంద‌బోయే ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించ‌నున్నార‌ని సమాచారం. వీరి ఇద్దరి కాంబినేష‌న్‌లో ఇంత‌కు ముందు ‘1971 బియాండ్ బోర్డ‌ర్స్‌’ సినిమా విడుద‌లైంది. ఇందులో అల్లు శిరీష్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.


logo