మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. మంచు విష్ణు నిర్మిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఉగాది సందర్భంగా మోహన్‌బాబు కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు. దేశభక్తి ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. శక్తివంతమైన పాత్రలో మోహన్‌బాబు కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.