శనివారం 30 మే 2020
Cinema - May 07, 2020 , 10:40:35

శ్రీమ‌తితో క‌లిసి కొత్త ర‌కం వంట‌కం త‌యారు చేసిన మోహ‌న్ బాబు

శ్రీమ‌తితో క‌లిసి కొత్త ర‌కం వంట‌కం త‌యారు చేసిన మోహ‌న్ బాబు

ఎప్పుడు మేక‌ప్‌లు వేసుకొని కెమెరా ముందు న‌టిస్తూ ఉండే మ‌న సినీ సెల‌బ్రిటీలు లాక్‌డౌన్ వేళ ఇంటి ప‌నుల‌తో బిజీగా ఉంటూ కాలం గ‌డుపుతున్నారు. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఇటీవ‌ల టి.సుబ్బరామిరెడ్డి తనయ పింకీ రెడ్డి ఛాలెంజ్‌ని స్వీక‌రించి మ‌సాలా వ‌డ‌ని ప్రిపేర్ చేశాడు. ఆ వ‌డ‌ని మనవరాలు విద్య నిర్వాణతో టేస్ట్ చేసి వావ్ అన్నారు.

తాజాగా త‌న శ్రీమ‌తి నిర్మ‌లా దేవి, కూతురు మంచు ల‌క్ష్మీతో క‌లిసి స‌రికొత్త వంటకం చేశాడు. ఇది ఇండియ‌న్, థాయ్ మేళ‌వింపుతో ఉంటుంద‌ట‌. ఖీమా స్టిక్కీ ఫ్రైడ్ రైస్ అని దీనికి పేరు పెట్ట‌గా, వంట త‌యారీకి సంబంధించిన వీడియోని మంచు ల‌క్ష్మీ త‌న ఇన్‌స్టాగ్రాములో షేర్ చేసింది. ఇది నెటిజ‌న్స్‌కి నోరూరేలా చేస్తుంది. కాగా, బీ ద రియ‌ల్ మ్యాన్ ఛాలెంజ్‌లో భాగంగా కొంద‌రు స్టార్ హీరోలు కూడా గ‌రిటెపట్టి పాక‌శాస్త్రంలో త‌మ నైపుణ్య‌త‌ని ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే.


logo