క్రికెటర్లు, సినీ నటులకు అభిమానులుంటారని తెలిసిందే. క్రికెటర్లకు వీరాభిమానులున్నానటీనటులున్నారు..మరోవైపు నటీనటులకు వీరాభిమానులున్న క్రికెటర్లు కూడా ఉన్నారు. తమ అభిమానాన్ని చాటుకోవడానికి క్రికెటర్లు డబ్ స్మాష్ వీడియోలను చేస్తుంటారు. కొందరు క్రికెటర్లేమో తమ కిష్టమైన నటుడిని అనుకరిస్తూ డైలాగ్స్ చెప్తుంటారు. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలోని డైలాగ్స్ చెప్పగా వీడియో వైరల్ అయింది.
తాజాగా ఒకప్పటి టీమిండియా క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) కూడా ఈ స్టిల్ లో చేరిపోయాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు (Mahesh Babu) పాపులర్ డైలాగ్ చెప్పి ఔరా అనిపించాడు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో తెలుసా..? దూకుడు సినిమాలోని మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్లిపోతా అంటూ వచ్చే పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి అందరిలో జోష్ నింపుతున్నాడు.
మహ్మద్ కైఫ్ చాలా కూల్ గా మహేశ్ స్టైల్ లో చెప్పిన ఈ డైలాగ్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మహేశ్ బాబు అభిమానులైతే తెగ షేర్లు చేస్తున్నారు.
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని