ఆదివారం 17 జనవరి 2021
Cinema - Jan 07, 2021 , 07:06:58

జాతీయ గీతం ఆల‌పించే స‌మ‌యంలో ఎమోష‌న‌ల్ అయిన సిరాజ్

జాతీయ గీతం ఆల‌పించే స‌మ‌యంలో ఎమోష‌న‌ల్ అయిన సిరాజ్

భారత పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ తండ్రి గౌస్‌ (53)  కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఇటీవ‌ల క‌న్నుమూసారు. ఆస్ట్రేలియా పర్య‌ట‌న స‌మ‌యంలో సిరాజ్  తండ్రి మృతి చెందగా, అత‌ని అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లేందుకు బీసీసీఐ సిరాజ్‌కు అవ‌కాశం క‌ల్పించింది. కాని తొలిసారి భార‌త టెస్ట్ జట్టుకు ఆడే అవ‌కాశం ద‌క్క‌డంతో పాటు క్వారంటైన్ నిబంధ‌న‌ల కారణంగా తాను స్వ‌దేశానికి వెళ్ళేందుకు అంగీక‌రించ‌లేదు. తండ్రి మృతి చెందాడ‌నే బాధ‌ను దిగ‌మింగుకొని తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

త‌న‌కు ద‌క్కిన అవ‌కాశాన్ని చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకున్న సిరాజ్ తాను ఆడిన‌ తొలి టెస్ట్ మ్యాచ్‌లో(2/40 , 3/37) ఐదు వికెట్స్ ద‌క్కించుకున్నాడు. ఈ రోజు జ‌రుగుతున్న మ్యాచ్‌లోను డాషింగ్ బ్యాట్స్‌మెన్ వార్న‌ర్‌ను 5 ప‌రుగుల‌కే వెన‌క్కు పంపి త‌ను టీంకు ఎంత అవ‌స‌ర‌మో నిరూపించాడు.  అయితే ఈ రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆల‌పిస్తున్న స‌మ‌యంలో సిరాజ్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. త‌న తండ్రి గుర్తొచ్చాడో  ఏమో కంట క‌న్నీరు పెట్టుకున్నాడు. సిరాజ్ ఎమోష‌ల్ అయిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. వీటిపై స్పందిస్తున్న నెటిజ‌న్స్ ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల‌లో మేము నీకు త‌ప్ప‌క అండ‌గా ఉంటాం అంటూ భ‌రోసా ఇస్తున్నారు.