బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 04, 2020 , 08:18:31

మెగా హీరోల సందేశానికి ఫిదా అయిన మోదీ

మెగా హీరోల సందేశానికి ఫిదా అయిన మోదీ

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి గురించి ప్ర‌జ‌ల‌లో ప్ర‌త్యేక అవ‌గాహ‌న తెచ్చేందుకు ఇటీవ‌ల చిరంజీవి, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్‌, నాగార్జున క‌లిసి ఓ వీడియో రూపొందించిన సంగ‌తి తెలిసిందే. కోటీ స్వ‌ర‌ప‌రిచిన ఈ సాంగ్‌లో న‌లుగురు హీరోలు న‌టించి క‌రోనాపై చ‌క్క‌ని సందేశం ఇచ్చారు. ఎవ‌రి ఇంట్లో వారు ఉండి మ్యూజిక్ వీడియోని రూపొందించారు. ఈ సాంగ్ వీడియోని డీడీ న్యూస్ త‌న అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌గా, దీనిపై తాజాగా స్పందించారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.

ప్రధాని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో  చిరంజీవి గారికి, నాగార్జున గారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు . అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం, అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దామని తెలిపారు. అయితే ఇక్కడ ముఖ్య విష‌య‌మేమంటే ఈ విష‌యాన్ని మోదీ తెలుగులో ట్వీట్ చేసారు. logo