శుక్రవారం 15 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 10:07:01

నాగార్జున స‌ర‌స‌న న‌టిస్తాన‌ని చెప్పిన మోనాల్

నాగార్జున స‌ర‌స‌న న‌టిస్తాన‌ని చెప్పిన మోనాల్

టిక్కెట్ టూ ఫినాలే టాస్క్‌తో మూడు రోజుల పాటు ముచ్చెమ‌ట‌లు పెట్టించిన బిగ్ బాస్ శుక్ర‌వారం రోజు ఇంటి సభ్యులకు ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌ను పెట్టాడు బిగ్‌బాస్‌. డ్రింక్ తాగుతూ ఒక‌రి నుండి ఒక‌రికి పాస్ చేయాల్సి ఉంటుంది. ఎవ‌రి ద‌గ్గర ఆగిపోతుందో వారు ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడాల‌ని బిగ్ బాస్ చెప్పారు. ప్ర‌క్రియ మొద‌లు కాగా, మొద‌టి రౌండ్‌లో సోహైల్ ఓడిపోయాడు. దీంతో డ్రింక్‌ని చేత్తో ట‌చ్ చేయ‌కుండా తాగేశాడు. త‌ర్వాత ఓడిన అభిజీత్ స్కూల్ డేస్ లో క్ర‌ష్ ఎవ‌రిపై ఉందో చెప్పుకొచ్చాడు. ఇక మోనాల్ ట్రూత్ ఎంచుకోగా, వరుణ్‌ తేజ్‌, నాగార్జున, విజయదేవరకొండ, అల్లు అర్జున్‌తో చాన్స్‌ వస్తే  ఎవ‌రితో చేస్తావు అని అడ‌గ‌గా చాలా స్మార్ట్‌గా నాగార్జున అని చెప్పుకొచ్చింది 

ఇలా ఈ గేమ్ స‌రదాగా సాగ‌గా, అనంత‌రం అవినాష్ ఒగ్గు క‌థ‌తో ఇటు ప్రేక్ష‌కుల‌ని అటు ఇంటి స‌భ్యుల‌ని అల‌రించాడు. ప్ర‌తి ఒక్క‌ర‌కిపై పొగ‌డ్త‌లు కురిపిస్తూ ఒగ్గు క‌థ చెప్పుకొచ్చాడు. ఆ త‌ర్వాత అంద‌రు ఎమోష‌న‌ల్ అయి ఒక‌రికొక‌రు హ‌గ్ చేసుకున్నారు.  సుమారు 20 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడుతూ బిగ్ బాస్‌కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు అవినాష్. ఈ సిట్యుయేష‌న్‌లో ఇంట్లో వాతావ‌ర‌ణం చాలా ఆహ్లాద‌క‌రంగా క‌నిపించింది.