ప్రస్తుతం ఏపీలో తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీ పెద్దలను కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నా కూడా తాజాగా ఆన్లైన్ టికెటింగ్ పద్ధతిని తీసుకురావడం మరింత ఆందోళన కలిగిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు సినీ పెద్దలు ఎవరూ నోరు తెరవలేదు. కానీ టికెట్ల ధరలు తగ్గించడంపై ఇప్పటికీ నిర్మాతలు మండిపడుతూనే ఉన్నారు. జగన్‌ను సినీ పెద్దలు కలిసి ఏదో ఒకటి తేల్చాలని మొరపెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ పెద్దలు, టికెట్ల అమ్మకాలపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినీ ప్రముఖులు కోరితేనే ప్రభుత్వం ఆన్లైన్ టికెటింగ్ నిర్ణయం తీసుకుందని నగరి ఎమ్మెల్యే రోజా చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి వాళ్లు వచ్చి కోరితేనే ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ల అమ్మకానికి నిర్ణయం తీసుకుందని రోజా చెప్పడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదలైన సమయంలోనే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించింది. దీంతో అసలు సమస్య మొదలైంది. ఈ రేట్లతో టికెట్లు అమ్మితే తమకు గిట్టుబాటు కాదంటూ ఎగ్జిబిటర్లు చేతులెత్తేస్తున్నారు. అందుకే చాలా సినిమాలను విడుదల చేయట్లేదు. టాలీవుడ్లో ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య నుంచి మొదలు పెట్టుకుని ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ వరకు చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయినా కూడా ఈ పెద్ద సినిమాలు విడుదల తేదీ గురించి ఆలోచించడం లేదు. ఏదో ఒకటి తేలిన తర్వాతనే సినిమాలు విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఎలాగైనా సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు జగన్‌ను ఒప్పించాలని సినీ ఇండస్ట్రీ చూస్తుంటే.. ఏకంగా టికెట్ల అమ్మకం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి సమయంలో సినీ పెద్దలు చెప్పినందుకే జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని రోజా చెప్పడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
MAA Elections 2021 : ఎట్టకేలకు మా అధ్యక్ష ఎన్నికల తేదీలు ఖరారు.. మరి కండిషన్స్ ఏంటో తెలుసా !
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటో తెలుసా..?
Rashmika Mandanna : రహస్యాల్ని బయటపెట్టను!
Bigg Boss: కాజల్‌కి ఫుల్ క్లాస్ పీకిన ప్రియ..ఎందుకో తెలుసా?
Bigg Boss: ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో తెలుసా?
Idol Winner: ఇద్దరు భార్యలు,ఇద్దరు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడల్ విన్నర్