శనివారం 30 మే 2020
Cinema - Apr 24, 2020 , 09:31:58

రాజ‌మౌళి సినిమాల‌న్నీ కాపీ అని తేల్చేసిన కుర్ర ద‌ర్శ‌కుడు

రాజ‌మౌళి సినిమాల‌న్నీ కాపీ అని తేల్చేసిన కుర్ర ద‌ర్శ‌కుడు

తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేసిన రాజ‌మౌళి ప్ర‌స్తుతం అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. ఆస్కార్ విన్నింగ్ సినిమా పారాసైట్ చూస్తుంటే నిద్ర వ‌చ్చింద‌ని, సినిమా చాలా బోర్ అని సంచ‌ల‌న కామెంట్స్ చేయడంతో నెటిజ‌న్స్ రాజ‌మౌళిని ఏకిపారేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మౌళిపై  ఓ కుర్ర దర్శకుడు ఓపెన్ లెట‌ర్ రాస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేసాడు.

పారాసైట్ చిత్రం వాస్త‌విక‌త‌కి అద్దం ప‌ట్టేలా ఉంది. ప్రత్యేకించి భాషా అడ్డంకులను అధిగమించేంత శ‌క్తివంత‌మైన‌దిగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా బాలేద‌ని రాజ‌మౌళి అన‌డం ఏ మాత్రం బాగోలేదు. అందుకే ఈ లెట‌ర్ రాస్తున్నాను అని ప్ర‌శాంత్ కుమార్ పేర్కొన్నాడు.  ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు పారాసైట్‌ని ఎంత‌గానో  ప్రశింసించారు.. కానీ బాహుబలిని ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు తానెక్కడా వినలేదని.. చూడలేదని.. ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే మీ సై సినిమాలో ఓ సీన్ మొత్తాన్ని కాపీ చేసారు అని ప్ర‌శాంత్ త‌న లేఖ‌లో పేర్కొన్నాడు.

సైతో పాటు మీరు తీసిన చాలా చిత్రాలు కూడా కాపీలే. ప‌బ్లిక్ ప్లాట్‌ఫాంలో పారాసైట్ లాంటి చిత్రాన్ని మీరు కించ‌ప‌ర‌చ‌డం ఏ మాత్రం బాగోలేదు. సినిమా చూడాలంటే నిర్ధిష్ట మాన‌సిక స్థితి మ‌రియు మనస్సు అవ‌స‌రం అని నేను అర్ధం చేసుకున్నాను. కాని మీరు ఆ మాన‌సిక స్థితిలో లేర‌ని నేను భావిస్తున్నాను అని ప్ర‌శాంత్ కుమార్ త‌న లెట‌ర్‌లో పేర్కొన్నారు. ఈ యువ ద‌ర్శ‌కుడు 2019లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా మిఠాయి సినిమా తెరకెక్కించిన చిత్రంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.


logo