బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 19:26:34

కరోనా: మిషన్ ఇంపాజిబుల్ 7, 8 భాగాలు వాయిదా

కరోనా: మిషన్ ఇంపాజిబుల్ 7, 8 భాగాలు వాయిదా

హైదరాబాద్: సక్సెస్‌ఫుల్ త్రిల్లర్ సిరీస్‌లోని మిషన్ ఇంపాజిబుల్ 7, 8 భాగాల విడుదల వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యమే ఇందుకు కారణం. 2022లో 8వ బాగం విడదలయ్యే నాటికి హీరో టామ్ క్రూజ్ వయసు 60కి చేరుకుంటుంది. మిషన్ ఇంపాజిబుల్-7 నిజానికి 2021 జూలై 23న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది 2021 నవంబర్ 19కి వాయిదా పడింది. మిషన్ ఇంపాజిబుల్-8 2022 ఆగస్టు 5న విడుదల కావాల్సి ఉండగా అది 2022 నవంబర్ 4కు వాయిదా పడింది. 1996లో మొదటిసారిగా క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో బ్రయాన్ దిపాల్మా దర్శకత్వంలో ఈథాన్ హంట్ పాత్ర పోషించారు. సిరీస్‌లో భాగంగా పాతికేళ్లకు పైగా ఆ పాత్రను ఆయన పోషిస్తూనే ఉన్నారు. ఇది ఒకరకంగా రికార్డే అని చెప్పాలి. 7వ భాగం కోసం యాక్షన్ సీన్ ఇటలీలో చిత్రీకరించాల్సి ఉండగా కరోనా కల్లోలం కారణంగా వాయిదా పడింది.logo